సీనియర్ స్టార్ హీరోలు మరోసారి బాక్సాఫీస్ క్లాష్ కు రెడీ అయ్యేలా ఉన్నారు. వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇదింకా పూర్తి కాకుండానే వెంకటేష్ ఈ నెలలో అనిల్ రావిపూడి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నారు. అక్టోబర్ 2 అనుకున్నప్పటికీ ఫైనల్ గా దసరా సందర్భంగా అక్టోబర్ 16 ఆదర్శ కుటుంబం రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట.
ట్విస్ట్ ఏంటంటే బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ని సైతం దసరాని టార్గెట్ చేసుకునే ఉద్దేశంతోనే చిత్రీకరణ వేగంగా జరుపుతున్నారట. బాలయ్య నాన్ స్టాప్ కోఆపరేషన్ వల్ల ఇది సాధ్యమయ్యేలా ఉందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. గతంలో భగవంత్ కేసరి ఈ ఫెస్టివల్ కే వచ్చి సూపర్ హిట్ అందుకుంది. లియో, టైగర్ నాగేశ్వరరావు లాంటి టఫ్ పోటీని తట్టుకుని ఆ నెలలో విజేతగా నిలిచింది. కలెక్షన్లు అవార్డులు గెలుచుకుంది.
చూస్తుంటే బాలకృష్ణ, వెంకటేష్ పరస్పరం బాక్సాఫీస్ వద్ద తలపడేలా ఉన్నారు. అయితే జూన్ 10 బాలయ్య పుట్టినరోజు సందర్భంగా వదలబోయే టీజర్ లో విడుదల తేదీని రివీల్ చేస్తారా లేదానేది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 16 దాదాపు ఖాయమని యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఇదే నిజమైతే మంచి మాస్ ప్లస్ క్లాస్ పోటీని థియేటర్లలో చూడొచ్చు. ఇప్పటికైతే రెండు నిర్మాణ సంస్థల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే ఆదర్శ కుటుంబం సక్సెస్ వెంకటేష్ కన్నా త్రివిక్రమ్ కే చాలా ముఖ్యం. ఎందుకంటే నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీకి మార్కెట్ జరగాలంటే ఇది చాలా కీలకం. వీరసింహారెడ్డని మించిపోయేలా మూవీ ఇస్తారని బాలయ్య ఫ్యాన్స్ ఆశలను టన్నుల లెక్కల్లో పెంచేసుకున్నారు. వెంకటేష్ ఫ్యాన్స్ సైతం తొలిసారి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడం పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈసారి ఫన్ తో పాటు క్రైమ్ కూడా ఉంటుందట.
This post was last modified on June 8, 2026 5:12 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…
ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…