Movie News

సుబ్బులక్ష్మి గారి పాత్రకు ఎవరు సరిపోతారు

సుప్రసిద్ధ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి బయోపిక్ తెరకెక్కించేందుకు గీత ఆర్ట్స్, బన్నీ వాస్ సంయక్తంగా ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు సాయిపల్లవి పేరు బలంగా వినిపించింది. కానీ తన డేట్లు బల్క్ లో అందుబాటులో లేవట. రామాయణ రెండో భాగానికి సంబంధించి ఇంకొంత షూటింగ్ పెండింగ్ ఉండటంతో పాటు ధనుష్ మూవీ షూట్ వల్ల ఇప్పుడప్పుడే కాల్ షీట్స్ ఇచ్చే పరిస్థితి లేదని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం.

ప్రస్తుతం రష్మిక మందన్న పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. ఇంకా ఖరారు చేయలేదు కానీ లుక్ టెస్ట్ చేశారని అంటున్నారు. ఇప్పుడప్పుడే ఈ ప్రాజెక్టుకి సంబంధించి అధికారిక ప్రకటన రాకపోవచ్చు. దశాబ్దాలుగా తెలుగు తమిళ కన్నడ ఇళ్లలో తన గొంతు ద్వారా శాశ్వత స్థానం సంపాదించుకున్న ఎంఎస్ సుబ్బులక్ష్మి అంటే కేవలం ఒక మహిళ పేరు కాదు. చరిత్ర కలిగిన ఒక విద్వత్తుకు నిలువెత్తు రూపం. అందుకే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీనికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తారనే టాక్ ఆల్రెడీ ఉంది. మూవీ లవర్స్ మాత్రం సాయిపల్లవి అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ రష్మికను తక్కువంచనా వేయడానికి లేదు. కీర్తి సురేష్, నిత్య మీనన్, రుక్మిణి వసంత్ పేర్లు పరిశీలనకు వచ్చాయి కానీ ఎవరినీ ఇంకా లాక్ చేయలేదట. అన్ని భాషల్లో రీచ్ అయ్యే యునివర్సల్ ప్రాజెక్టు కాబట్టి దానికి అనుగుణంగానే క్యాస్టింగ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

కాకపోతే సావిత్రి గారి లాగా సుబ్బులక్ష్మి గారి జీవితంలో ఎక్కువ డ్రామా లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించడం కష్టం. సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే మ్యూజిక్, హీరోయిన్ పెర్ఫార్మన్స్ తో ఆడాల్సిన సినిమా. అందుకే నటి ఎంపిక కీలకం అవుతుంది. అఫీషియల్ అప్డేట్ ఇంకా రాలేదు కాబట్టి ఇదంతా ప్రస్తుతం ఉహాగానాల స్టేజిలోనే ఉంది. కార్యరూపం దాలిస్తే ఒక లెజెండరీ సింగర్ మీద తీసిన తొలి బయోపికి గా సుబ్బులక్ష్మిగారి సినిమా నిలిచిపోతుంది.

This post was last modified on June 8, 2026 12:48 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

54 minutes ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

11 hours ago