ఇంకో మూడు రోజుల్లో జూన్ 10 బాలకృష్ణ పుట్టినరోజు రానుంది. ఈసారి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈసారి వాళ్లకు ప్రత్యేక కానుకలు సిద్ధమవుతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111 టైటిల్ రివీల్ తో పాటు ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు. వీరసింహారెడ్డి కాంబినేషన్ కావడంతో అంచనాలు విపరీతంగా ఉన్నాయి. చాలా గ్యాప్ తర్వాత బాలయ్య ఫుల్ లెన్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారని టాక్.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే యాక్షన్ ఎంటర్ టైనర్ తాలూకు అప్డేట్ కూడా అదే రోజు ఇవ్వబోతున్నారని సమాచారం. సంగీత దర్శకుడు ఎవరనేది రివీల్ చేస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా మరో సర్ప్రైజ్ కాంబో అనౌన్స్ మెంట్ ఉంటుందని అంటున్నారు కానీ అదేంటో కన్ఫర్మ్ అయితే చెప్పలేం. వీటినలా ఉంచితే బాలయ్య మూడు బ్లాక్ బస్టర్లను ఒకే రోజు రీ రిలీజ్ చేయడం అభిమానులను అయోమయంలో పడేస్తోంది.
వాటిలో మొదటిది భైరవ ద్వీపం. 1994లో వచ్చిన ఈ జానపద ఫాంటసీ అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. జూన్ 11 విడుదల కాబోతున్న సింగ్ గీతం దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారే ఆ ఎపిక్ మూవీకి డైరెక్టర్ కావడం గమనించాల్సిన విషయం. మరొకటి సమరసింహారెడ్డి. 1999లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన ఈ ఆల్ టైం హిట్ ని మరోసారి తీసుకొస్తున్నారు. గతంలో ఒకసారి చేసినప్పటికీ సరైన ప్లానింగ్ లేక ఆడియన్స్ కి చేరలేదు.
చివరిది నరసింహనాయుడు. ఇది కూడా ఆషామాషీ హిట్టు బొమ్మ కాదు. బాలయ్యలో ఊర మాస్ సీమ హీరోయిజంని బయటికి తెచ్చిన రెండు సినిమాలు ఈ సందర్భంగా రావడం విశేషం. ఇన్నేసి గిఫ్టులు ఉన్నాయంటే ఫ్యాన్స్ ఆనందం మాములుగా ఉంటుందా. ఇదంతా బాగానే ఉంది కానీ పనిలో పని ఆదిత్య 999 మ్యాక్స్ మొదలుపెట్టాలని మూవీ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు. క్రిష్ కు ఆ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది కానీ ఇంకా ఫైనల్ అయితే కాలేదట.
This post was last modified on June 7, 2026 10:15 pm
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…