Political News

ప్రకాష్ రాజ్‌కు పెద్ద ఆయుధాన్నిచ్చారే…

వరుసగా మూడో పర్యాయం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కారు మీద చాలా ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం చేస్తున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. ఆయన రాజకీయాల్లో ఉన్నదే మోడీ ప్రభుత్వం మీద పోరాటానికే అన్నట్లుగా ఉంటుంది తన వ్యవహారం. మోడీకి వ్యతిరేకంగా ఉనన వాళ్లు ఆయనకు మిత్రులు. అదే సమయంలో మోడీ మిత్రులంతా తన శత్రువులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు.

2019 ఎన్నికల్లో ఆయన బెంగళూరు నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు కూడా. డిపాజిట్ రాకపోయినా సరే.. రాజకీయాల్లో తన పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాక్రోచ్ జనతా పార్టీకి ఆయన మద్దతుదారుగా మారిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ఆందోళనలతో కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ప్రకాష్ రాజ్ ఆనందానికి అవధుల్లేవు. ఇలాంటి టైంలో ప్రకాష్ రాజ్ చేతికి ఇంకో ఆయుధాన్నిచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఎస్ఐఆర్‌లో భాగంగా దేశవ్యాప్తంగా లక్షల్లో ఓట్లు రద్దవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బెంగళూరులో ప్రకాష్ రాజ్ ఓటు కూడా గల్లంతయిందట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజే ఒక వీడియో ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని వెల్లడిస్తున్నపుడు ఆయన ఆనందం చూస్తే.. భలే ఛాన్స్ దొరికింది అన్నట్లే ఉంది. తాను పుట్టి పెరిగిన, చదువు కూడా పూర్తి చేయడమే కాక ఎంపీగా పోటీ కూడా చేసిన నియోజకవర్గంలో తన ఓటు తీసేశారని ఆయన వెల్లడించారు.

మీకు ఓటు వేయని వాళ్ల ఓట్లు తీసేస్తారు కానీ.. మిమ్మల్ని గద్దె దించకుండా మాత్రం మమ్మల్ని ఆపలేరు అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వీడియోలో అంతటా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆ నవ్వు చూస్తే నా ఓటు తీయడం ద్వారా భలే ఆయుధాన్నిచ్చారు, దీని మీద ఎంత రచ్చ చేస్తానో చూడండి అన్నట్లే ఉంది. ఇది ప్రకాష్ రాజ్‌కే కాదు, ప్రతిపక్షాలన్నింటికీ ఆయుధం లాంటిదే. మరి ప్రకాష్ రాజ్ ఓటు తీసేయడంపై ఎన్నికల కమిషన్ అధికారులు ఏమని బదులిస్తారో చూడాలి.

This post was last modified on August 11, 2026 1:20 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

46 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

52 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

6 hours ago