Movie News

బాలీవుడ్ ఏడుపు… టాలీవుడ్ గ‌ప్‌చుప్‌

బాహుబ‌లి సినిమాను అప్ప‌ట్లో టాలీవుడ్‌ను మించి బాలీవుడ్‌యే ఎక్కువ‌గా మోసింది. అందుక్కార‌ణం అగ్ర నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఆ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయ‌డం. కానీ ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించి.. టాలీవుడ్ ముందు బాలీవుడ్ వెల‌వెల‌బోయేలా చేసింది. ఆ త‌ర్వాత ఆర్ఆర్ఆర్, పుష్ప‌, క‌ల్కి, కార్తికేయ‌-2 లాంటి తెలుగు సినిమాలు హిందీ మార్కెట్‌ను కొల్ల‌గొట్ట‌డంతో టాలీవుడ్‌ను చూసి అసూయ చెంద‌డం మొద‌లైంది బాలీవుడ్‌లో.

అందుకే ఇంత‌కుముందులా మ‌న సినిమాల గురించి అక్క‌డి వాళ్లు పాజిటివ్‌గా మాట్లాడ్డం లేదు. పైగా ఏమాత్రం అవ‌కాశం ద‌క్కినా మ‌న సినిమాల‌ను త‌క్కువ చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నారు. మీడియా ద్వారా తెలుగు సినిమాల‌ను టార్గెట్ చేసే ప్ర‌య‌త్న‌మూ జ‌రుగుతోంది.

తాజాగా పెద్ది సినిమా మీద జ‌రుగుతున్న దాడి అలాంటిదే. ఇందులో జాన్వి క‌పూర్ ప్రెజెంట్ చేసిన తీరు చాలా వ‌ల్గ‌ర్‌గా ఉందంటూ బాలీవుడ్ మీడియా తెగ బాధ ప‌డిపోతోంది. అప్ప‌టికేదో హిందీ చిత్రాల్లో హీరోయిన్లను ప‌ర‌మ ప‌విత్రంగా చూపించేట్లు.. అక్క‌డ ఏమాత్రం అస‌భ్య‌త ఉండ‌ద‌న్న‌ట్లు బాలీవుడ్ మీడియా నీతి సూత్రాలు వ‌ల్లించ‌డ‌మే విడ్డూరం.

నార్త్ మార్కెట్‌ను తెలుగు సినిమాలు కొల్ల‌గొట్టేస్తున్నాయ‌న్న అక్క‌సుతో ప‌నిగ‌ట్టుకుని పెద్ది సినిమాను బాలీవుడ్ జ‌నాలు టార్గెట్ చేయిస్తున్నార‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. హిందీ మీడియా, సోష‌ల్ మీడియా దాడికి భ‌య‌ప‌డి ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు సానా క్ష‌మాప‌ణ చెప్ప‌డ‌మే కాక‌, జాన్వి మీద కొన్ని సీన్ల‌ను క‌త్తిరించేస్తున్న‌ట్లు కూడా ప్ర‌క‌టించాడు. ఇది రామ్ చ‌ర‌ణ్ అభిమానుల‌కు న‌చ్చ‌డం లేదు.

ఇదిలా ఉంటే.. ఇలాంటి టైంలో పెద్ది టీంకు టాలీవుడ్ నుంచి స‌రైన మ‌ద్ద‌తు ల‌భించ‌డ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఈ వివాదం మీద బుచ్చిబాబు అండ్ కోకు స‌పోర్ట్ చేయ‌డం ప‌క్క‌న పెడితే.. క‌నీసం పెద్ది మూవీని టాలీవుడ్ సినీ జ‌నాలెవ్వ‌రూ ప్ర‌మోట్ చేయ‌క‌పోవ‌డం షాకింగే.

ఇండ‌స్ట్రీ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎలా నిల‌బ‌డ‌తారో తెలిసిందే. ఎవ‌రికే సాయం కావాల‌న్నా చేస్తారు. ఎంత బిజీగా ఉన్నా.. ఎవ‌రు ఏ ఈవెంట్‌కు పిలిచినా వెళ్లి ఆశీర్వ‌దిస్తారు. ఇక చ‌ర‌ణ్ కూడా ఎంత స‌పోర్టివ్‌గా ఉంటారో తెలిసిందే.

కానీ మెగా ప‌వ‌ర్ స్టార్ కెరీర్ బెస్ట్ అన‌ద‌గ్గ పెర్ఫామెన్స్ ఇస్తే.. ఎంత‌మంది ఆయ‌న్ని అభినందిస్తూ, పెద్ది సినిమాను కొనియాడుతూ సోష‌ల్ మీడియా పోస్టులు పెట్టారా అని చూస్తే.. నంబ‌ర్ చాలా చిన్న‌దిగా క‌నిపిస్తుంది.

పెద్ది టాలీవుడ్ గ‌ర్వించే చిత్రం కాక‌పోవ‌చ్చు కానీ.. మ‌న ఇండ‌స్ట్రీ ఓన్ చేసుకోలేనంత సాధార‌ణ సినిమా అయితే కాదు. మ‌రి నార్త్ మీడియా, సోష‌ల్ మీడియా ప‌నిగ‌ట్టుకుని పెద్ది సినిమాను టార్గెట్ చేస్తున్న స‌మ‌యంలో టాలీవుడ్ ఇలా గ‌ప్‌చుప్‌గా ఉండ‌డ‌మేంటో? ఇండ‌స్ట్రీలో ఎవ‌రి స్వార్థం వారిదే అన‌డానికి ఇది తాజా రుజువుగా క‌నిపిస్తోంది.

This post was last modified on June 7, 2026 7:26 pm

Share

Recent Posts

హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట…

3 hours ago

బెంగాల్ రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు

ప‌శ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ‌కాలం పాటు పాల‌న సాగించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఈ ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం…

6 hours ago

వ‌రంగల్‌కు ఎయిర్‌పోర్టు… ఆ పేర్లు పెట్ట‌మ‌న్న‌ సందీప్ వంగ

ఎయిర్‌పోర్టులంటే పెద్ద సిటీల్లోనే ఉండాల‌నే నియ‌మాలేమీ లేవిప్పుడు. టైర్-2 సిటీలు, ప‌ట్ట‌ణాల‌కు కూడా విమానాశ్ర‌యాలు విస్త‌రిస్తున్నాయి. ఐతే మ‌రో తెలుగు…

6 hours ago

‘రాకా’ అనిరుధ్ లేదా జి.వి.ప్రకాష్ అనుకుని…

‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. దీని తర్వాత అతను ఏ…

6 hours ago

ఈ క్లారిటీ ముందే ఉండాల్సింది డైరెక్టర్ గారు

టాలీవుడ్ యువ న‌టుడు సుహాస్ న‌టించిన త‌మిళ చిత్రం మండాడి బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన నేప‌థ్యంలో గురువారం చెన్నైలో నిర్వ‌హించిన…

6 hours ago

ప‌వ‌న్ క‌ల్యాణ్… బ్యాక్ టు డ్యూటీ!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఏపీకి చేరుకున్నారు. గ‌త నెల…

6 hours ago