Movie News

హీరోయిన్స్ మద్య రొమాన్స్.. బాగా వాడుకున్నారుగా..

బాలీవుడ్ సినిమా కాక్‌టైల్ 2 చుట్టూ గత కొద్ది రోజులుగా ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కృతి సనన్, రష్మిక మందన్నా మధ్య ఈ సినిమాలో రొమాన్స్ అంటూ అది ఒక లెస్బియన్ ట్రాక్ తరహాలో ఉండబోతోందనే టాక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎలాంటి అఫీషియల్ అప్ డేట్ లేకపోయినా, కేవలం ఈ ఒక్క గాసిప్ తో సినిమా పేరు మీమ్స్, రీల్స్ లో గట్టిగానే ట్రెండ్ అయింది. రూపాయి ఖర్చు లేకుండా మేకర్స్ కు కావాల్సినంత పబ్లిసిటీ దొరికేసింది. ఐపీఎల్ టైమ్ లో కూడా ఆ రూమర్ వైరల్ అవ్వడంతో సినిమాపై ఓ వర్గం వారి ఫోకస్ పడింది.

అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. రూమర్ వైరల్ అవుతున్న టైమ్ లో సైలెంట్ గా ఉన్న మేకర్స్, రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై క్లారిటీ ఇచ్చారు. సినిమాలో అలాంటి ట్రాక్ ఏమీ లేదని, హీరో షాహిద్ కపూర్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే రెండు రెగ్యులర్ లవ్ స్టోరీస్ మాత్రమే ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో ఇన్ని రోజులు జరిగిన ప్రచారానికి చెక్ పడింది.

ఇలాంటి ఒక రూమర్ పుట్టడానికి కారణం ఆడియన్స్ మైండ్ సెట్ మారడమే. మొదటి పార్ట్ కాక్‌టైల్ వచ్చినప్పుడు ఆ కథ చాలా బోల్డ్ గా అనిపించింది. ఇప్పుడు ఓటీటీల కారణంగా జనాలకు కొత్త తరహా రిలేషన్ షిప్స్ మీద అవగాహన పెరిగింది. అందుకే సీక్వెల్ లో కచ్చితంగా ఏదో కొత్తదనం ఉంటుందని ఊహించుకుని ఈ గాసిప్ ను ఈజీగా నమ్మేశారు. మేకర్స్ ఒక రకంగా ఈ క్యూరియాసిటీని మార్కెటింగ్ కోసం చాలా తెలివిగా వాడుకున్నారు.

మరోవైపు రష్మిక కెరీర్ కు హిందీలో ఈ ప్రాజెక్ట్ చాలా కీలకం. సడెన్ గా ఈ టాక్ రావడం వల్ల రష్మిక క్యారెక్టర్ మీద అందరి ఫోకస్ పడింది. డైరెక్టర్ హోమీ అదాజానియా కు కూడా సినిమా ప్రమోషన్స్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ రూమర్ వల్ల సినిమా టైటిల్ జనాల్లోకి బాగా వెళ్లిపోయింది.

సినిమాలో కాంట్రవర్సీకి దారితీసే సీన్స్ లేకపోయినా, ఈ గాసిప్ తెచ్చిన క్రేజ్ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. జూన్ 19 తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పుడున్న బజ్ ను పాటలు, ట్రైలర్ తో సరిగ్గా కంటిన్యూ చేస్తే ఓపెనింగ్స్ కు ఎలాంటి డోకా ఉండదు. ఫ్రీగా వచ్చిన ఈ పబ్లిసిటీని బాక్సాఫీస్ కలెక్షన్స్ గా మార్చుకోవాలంటే మాత్రం కంటెంట్ ఆడియన్స్ కు గట్టిగా కనెక్ట్ అవ్వాలి. షాహిద్ రెండు లవ్ ట్రాక్స్ ను ఎలా బ్యాలెన్స్ చేశాడనే దాని మీదే రిజల్ట్ ఆధారపడి ఉంది.

This post was last modified on June 4, 2026 11:54 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

18 minutes ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

28 minutes ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

44 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

1 hour ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago