పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధనం, బంగారం దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విదేశీ మారకద్రవ్యాన్ని వెచ్చిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రధాని మోడీ స్వయంగా హైదరాబాద్‌లో పర్యటించిన సమయంలోనే వెల్లడించారు. నేరుగా ఆయన విదేశీ మారక ద్రవ్యంలోటు గురించి చెప్పకపోయినా.. అందరూ పొదుపు చేయాలని.. తద్వారా విదేశీ మారకద్రవ్యం పెరుగుతుందని అన్నారు.
ఈ క్రమంలోనే పెట్రోలు, డీజిల్ పొదుపుతోపాటు ఏడాది పాటు బంగారాన్ని కూడా కొనుగోలు చేయొద్దని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ఇక ఆ తర్వాత.. కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. బంగారం కొనుగోళ్లు కూడా 70 శాతం మేరకు తగ్గాయని నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఇప్పుడు విదేశీ పత్రిక, పరిశోధనాత్మక జర్నలిజానికి పెట్టింది పేరైన బ్లూంబర్గ్ తాజాగా సంచలన విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోడీ పొదుపు మంత్రం ప్రకటించే సరికే.. భారత దేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటాయని బ్లూంబర్గ్ తెలిపింది. అంతేకాదు.. విదేశీ మారకద్రవ్యం కోసం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తన వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించేసిందని.. బ్లూంబర్గ్ బాంబు పేల్చింది. కేవలం ఫారెక్స్ నిల్వలను కాపాడుకునేందుకే ఈ చర్చ చేశారని కూడా పేర్కొంది. అమెరికా డాలరుతో పోలిస్తే.. రూపాయి విలువ భారీగా పతనమవుతోందని.. అందుకే.. బంగారాన్ని విక్రయించారని తెలిపింది.
ఖండించిన భారత్..
అయితే.. బ్లూంబర్గ్ కథనాన్ని కేంద్రం సహా ఆర్బీఐలు ఖండించాయి. ఇది తప్పుడు కథనమని పేర్కొన్నాయి. బంగారం విక్రయంపై వచ్చిన వార్తలు పూర్తి అవాస్తవమని పేర్కొన్నాయి. ఆర్‌బీఐ వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా ఏటి కేడు పెరుగుతోందని తెలిపాయి. బ్లూంబర్గ్ కథనంలో వాస్తవం లేదని పేర్కొన్నాయి.
గతంలో చెప్పినవి నిజాలే..
అయితే.. గతంలో భారత్‌కు సంబంధించి బ్లూమ్‌బర్గ్ వెలువరించిన పలు కథనాలు వాస్తవమయ్యాయి. చైనా విషయంలో మోడీ వ్యవహరించిన తీరు.. పార్లమెంటులో తీవ్ర వివాదానికి దారి తీసింది. అలానే అదానీ పెట్టుబడుల కోసం.. ఎల్ ఐసీని విక్రయిస్తున్నారన్న కథనం కూడా దాదాపు నిజమైంది. దీంతో ఇప్పుడు బ్లూంబర్గ్ వెలువరించిన కథనం సంచలనంగా మారింది.
This post was last modified on June 3, 2026 10:33 pm
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…