Movie News

చిరు పుత్రోత్సాహంలో ఇది పీక్స్

ఒక టాప్ హీరో వార‌స‌త్వాన్నందుకుని సినీ రంగంలోకి అడుగుపెట్టి అంచ‌నాల‌ను అందుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. మొత్తం ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీలో అలాంటి హీరోలు చాలా త‌క్కువ‌మంది క‌నిపిస్తారు. తెలుగు హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, అక్కినేని నాగార్జున‌, మ‌హేష్ బాబు లాంటి కొద్ది మందే తండ్రి వార‌స‌త్వాన్ని నిల‌బెట్టారు.

వీరిలో మ‌హేష్ బాబు తండ్రిని మించిన త‌న‌యుడు అనిపించుకున్నాడు. త‌ర్వాతి త‌రంలో ఇలాంటి గుర్తింపు రామ్ చ‌ర‌ణ్‌కే ద‌క్కింది. న‌టుడిగా చిరును మించాడ‌ని చెప్ప‌లేం కానీ.. తెలుగు రాష్ట్రాల‌ను దాటి చిరును మించి మార్కెట్ సంపాదించిన ఘ‌న‌త రామ్ చ‌ర‌ణ్ సొంతం. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబ‌ల్ లెవెల్లో అత‌ను పేరు సంపాదించాడు.

కెరీర్ ఆరంభంలోనే మ‌గ‌ధీర లాంటి మెగాబ్లాక్ బ‌స్ట‌ర్‌తో చిరుకు త‌గ్గ వార‌సుడిన‌ని రామ్ చ‌ర‌ణ్ రుజువు చేశాడు. కానీ పెర్ఫామ‌ర్‌గా అత‌డికి తిరుగులేని గుర్తింపు తెచ్చింది… న్యూట్ర‌ల్ ఫ్యాన్స్‌లోనూ గొప్ప పేరు తెచ్చిపెట్టింది మాత్రం రంగ‌స్థ‌లం చిత్రం అనే చెప్పాలి.

అప్ప‌టిదాకా కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ రామ్ చ‌ర‌ణ్‌ను వ్య‌తిరేకించే వాళ్లు కూడా రంగ‌స్థ‌లం చూసి ఫిదా అయిపోయారు. ఆ సినిమాలో చ‌ర‌ణ్ న‌ట‌న‌కు నూటికి నూరు మార్కులు ప‌డిపోయాయి. చ‌ర‌ణ్ ఎంత పెద్ద స్టార్‌గా ఎదిగిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రంతో అందుకున్న ప్ర‌శంస‌లు చిరు క‌డుపు నింపేశాయి. ఆయ‌న‌కు అసలైన పుత్రోత్సాహం అప్పుడే కలిగింద‌ని చెప్పొచ్చు.

ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా చ‌ర‌ణ్ గొప్ప ప్ర‌శంస‌లే ద‌క్కించుకున్నాడు. గ్లోబ‌ల్ లెవెల్లో త‌న కొడుక్కి వ‌చ్చిన గుర్తింపుకి చిరు ఎంతో పొంగిపోయి ఉంటాడ‌న‌డంలో సందేహం లేదు. ఐతే ఇప్పుడు పెద్ది సినిమా చిరుకు పుత్రోత్సాహంలో పీక్స్‌ను చూపిస్తోంది. రంగ‌స్థ‌లం సినిమా రిలీజైన‌పుడు చ‌ర‌ణ్‌కు గొప్ప పేరు వ‌చ్చింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ సైతం అంతే ప్ర‌శంస‌లు అందుకున్నాడు. ఫోక‌స్ ఇద్ద‌రి మీదా ఉంద‌ప్పుడు.

ఆ సినిమాకు యునానిమ‌స్ టాక్ రావ‌డం, అందులో క్రాఫ్ట్ అద్భుతంగా ఉండ‌డంతో ఫోక‌స్ చ‌ర‌ణ్ ఒక్క‌డి మీదే నిల‌వ‌లేదు. కానీ పెద్ది సినిమా విష‌యంలో అలా కాదు. ఈ సినిమా రామ్ చ‌ర‌ణ్ వ‌న్ మ్యాన్ షో అని ముక్త‌కంఠంతో కీర్తిస్తున్నారు. పాత్ర కోసం అత‌ను ప‌డ్డ క‌ష్టాన్ని, త‌న ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌ను అంద‌రూ కొనియాడుతున్నారు.

సినిమాకు కొంచెం మిక్స్‌డ్ టాక్ ఉన్న నేప‌థ్యంలో ఇప్పుడు ఫోక‌స్ మొత్తం చ‌ర‌ణ్ మీదే నిలిచింది. ఈ స‌క్సెస్ క్రెడిట్ చాలా వ‌ర‌కు అత‌డికే ద‌క్క‌బోతోంది. న‌టుడిగా చ‌ర‌ణ్ కెరీర్లో ది బెస్ట్ ఇప్ప‌టికీ రంగ‌స్థ‌లంయే అయిన‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్ ఎఫ‌ర్ట్, బాక్సాఫీస్ స‌క్సెస్‌లో మేజ‌ర్ క్రెడిట్ పెద్ది విష‌యంలోనూ ఎక్కువ కాబ‌ట్టి దీన్ని త‌న కెరీర్ బెస్ట్‌గా చూస్తున్నారు అభిమానులు. అందుకే చిరు పుత్రోత్సాహంలోనూ ఇది పీక్స్ అని చెప్పొచ్చు.

This post was last modified on June 4, 2026 11:47 pm

Share

Recent Posts

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

9 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

1 hour ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

2 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

4 hours ago

చిరుకు వచ్చిన ఇబ్బందే ప్రభాస్‌కూ

టాలీవుడ్లో ఈ మధ్య రిలీజ్ డేట్ పంచాయితీలు బాాగా పెరిగిపోతున్నాయి. సెప్టెంబరు 24న రావాల్సిన నాని సినిమా ‘ది ప్యారడైజ్’ను…

5 hours ago