Movie News

ఆర్టిస్టులను ఇంకొంచెం వాడుకుని ఉంటే

పెద్దిలో అందరూ రామ్ చరణ్, జగపతిబాబు, శివరాజ్ కుమార్ పెర్ఫార్మన్స్ గురించి మాట్లాడుతున్నారు. అందులో ఆశ్చర్యం ఏమి లేదు. దర్శకుడు బుచ్చిబాబు ఈ క్యారెక్టర్లను తీర్చిదిద్దిన విధానం అలా కుదిరింది. అయితే కొంత మిక్స్డ్ టాక్ రావడం వెనుక క్యాస్టింగ్ ని సరిగా వాడుకోలేదనే కామెంట్స్ కూడా అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎక్కువ కనిపించిన విలన్ దివ్యెందు శర్మ రెండో సగం క్లైమాక్స్ లో తప్ప మళ్ళీ ఎక్కడా కనిపించడు.

రావు రమేష్ ఉన్నాడని ఫలానా సీన్ గుర్తు చేస్తే తప్ప సామాన్య ప్రేక్షకులకు ఫ్లాష్ కానంత తక్కువ నిడివి ఆయనకు పెట్టారు. పుష్పలో కూడా లెన్త్ ఎక్కువ లేకపోయినా మంత్రి, సిఎం క్యారెక్టర్ ద్వారా సుకుమార్ ఎలా వాడుకున్నారో తెలిసిందే. శ్రీకాంత్ అయ్యంగార్, జాన్ విజయ్ తదితరులకు గెటప్స్ ఘనంగా ఇచ్చారు కానీ పట్టుమని రెండు డైలాగులు లేవు. కమెడియన్ సత్య మాట్లాడేది కూడా చాలా తక్కువ. ఇలా ఎంతో మందిని బుచ్చిబాబు అలా టచ్ చేసి వదిలేశారనే మాట గట్టిగానే ఉంది.

కేవలం రామ్ చరణ్ మీదే ఫోకస్ పెట్టకుండా మరికొన్ని థ్రెడ్స్ ద్వారా అందరినీ వాడుకునేలా కొన్ని మార్పులు చేసి ఉంటే టెంపో పెరిగేదన్న అభిప్రాయాన్ని కొట్టి పారేయలేం. జాన్వీ కపూర్ సైతం ఇంటర్వెల్ తర్వాత చాలా సేపు కనిపించదు. ఇదంతా కథానుసారం చేశామని టీమ్ చెప్పుకున్నా ప్రాముఖ్యత కలిగిన ఆర్టిస్టులు అంత సేపు స్క్రీన్ మీద కనిపించకుండా పోతే కనెక్టివిటీ తగ్గిపోతుంది. పెద్దికొచ్చిన సమస్యల్లో ఇదీ ఒకటని చెప్పక తప్పదు.

దీని వల్ల పెద్ది ఎంతవరకు ప్రభావితం చెందిందనేది ఇప్పుడప్పుడే తేలదు. కనీసం వారం పది రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. చరణ్ లాంటి టాప్ హీరోకు మొదటి వీకెండ్ ఫుల్స్ పడటం పెద్ద విషయం కాదు. ఒకవేళ వీక్ డేస్ వచ్చాక కూడా ఆక్యుపెన్సీలు బలంగా ఉంటే పెద్ది చేతిలో సాలిడ్ బ్లాక్ బస్టర్ ఉన్నట్టే. ట్రేడ్ అయితే ఆ నమ్మకంతోనే ఉంది. స్క్రీన్ స్పేస్ వల్లనేమో ప్రమోషన్స్ లో జగపతిబాబు తప్ప వేరే ఏ ఇతర ఆర్టిస్టులు కనిపించలేదు కాబోలు.

This post was last modified on June 4, 2026 11:42 pm

Share

Recent Posts

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

16 minutes ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

36 minutes ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

2 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

3 hours ago

మహారాజాకు దక్కిన హాలీవుడ్ గౌరవం

రెండేళ్ల క్రితం పెద్దగా అంచనాలు లేకుండా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న మహారాజ త్వరలో హాలీవుడ్ రీమేక్ కాబోతోందన్న వార్త…

3 hours ago

ఎల్లమ్మకు దొరికింది మంచి ఛాయిసే

సంగీత సంచలనం దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయమవుతున్న ఎల్లమ్మను నెలల తరబడి వేధించిన సమస్య హీరోయిన్ ఎంపిక. మృణాల్ ఠాకూర్,…

4 hours ago