తమిళ విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తీసింది తక్కువ సినిమాలే కానీ.. వాటిలో చాలా వరకు ఆణిముత్యాలే. అతడి సినిమాలు కొన్ని ప్రేక్షకులపై అలాంటిలాంటి ఇంపాక్ట్ చూపించ లేదు. అలా బలంగా ప్రభావం చూపించిన సినిమాల్లో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ (యుగానికి ఒక్కడు) ఒకటి. కార్తి హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్దగా అంచనాల్లేకుండా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు స్టన్ అయిపోయేలా ఈ సినిమా సాగింది. కొంత మిశ్రమ అనుభూతి కలిగించినప్పటికీ.. ఆ సినిమా కథాంశం, కొన్ని ఎపిసోడ్లు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తానని సెల్వ ఎప్పట్నుంచో చెబుతున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చట్లేదు. ఐతే ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ‘ఆయిరత్తిల్ ఒరువన్-2’ సన్నాహాల్లో ఉన్న సెల్వ రాఘవన్.. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఆసక్తికర విషయం ఏంటంటే.. సీక్వెల్లో నటించిన కార్తి ఇందులో కథానాయుడిగా నటించట్లేదు. అతడి స్థానంలోకి సెల్వ రాఘవన్ తమ్ముడే అయిన స్టార్ హీరో ధనుష్ వచ్చాడు. ఇంతకుముందు సెల్వ, ధనుష్ కలిసి చేసిన తుల్లువదో ఎలమై, కాదల్ కొండేన్, పుదు పేట్టై, మయక్కం ఎన్నా క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. వీళ్ల కలయికలో కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా చర్చల్లో ఉన్న ఈ కాంబినేషన్ ఎట్టకేలకు ఓకే అయింది. ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ అనగానే కార్తి కాకుండా మరొకరిని ఊహించుకోలేం. కానీ ధనుష్ ఎలాంటి పెర్ఫామరో తెలిసిందే కాబట్టి అతను హీరోగా అయినా ఈ సీక్వెల్ ఎగ్జైట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఐతే ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది. అయినా సరే.. ఏకంగా 2024లో విడుదల అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బట్టి ఈ చిత్రాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఓ ‘బాహుబలి’లా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారేమో.
This post was last modified on January 2, 2021 8:31 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్‌ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్‌లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…