వారణాసి విడుదల ఇంకో ఏడాది టైం ఉందని, పదే పదే మహేష్ బాబు రీ రిలీజులను క్యూ కట్టడం ఎంత మాత్రం భావ్యంగా లేదని అభిమానులే ఫీలవుతున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పుట్టినరోజు కృష్ణగారిది అయితే మహేష్ రెండు సినిమాలు అతిథి, 1 నేనొక్కడినే కేవలం ఒక రోజు గ్యాప్ లో మళ్ళీ విడుదల చేశారు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ లో కొన్ని షోలు మినహాయించి మిగిలిన చోట్ల ఆశించిన స్పందన రాలేదని వసూళ్లు తేటతెల్లం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఆగస్ట్ లో వచ్చే మహేష్ పుట్టినరోజు సందర్భంగా అప్పుడే రెండు అనౌన్స్ మెంట్లు వచ్చాయి. ఒకటి పోకిరి. రెండోది దూకుడు. మొదటిది ఆల్రెడీ గతంలో రీ రిలీజై రికార్డు వసూళ్ళను రాబట్టుకుంది. అసలది జరగలేదన్నట్టు ఇప్పుడు కొత్తగా పోకిరిని ప్రమోట్ చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. దూకుడు సంగతి సరేసరి. శాటిలైట్ ఛానల్స్, యూట్యూబ్ లో అరిగిపోయినా సరే బిగ్ స్క్రీన్ మీద చూడాలనే ఎగ్జైట్ మెంట్ చాలా మంది అభిమానుల్లో ఉంది.
ఇలా పదే పదే అరిగిపోయే దాకా మళ్ళీ మళ్ళీ విడుదల చేయడం వల్ల మహేష్ బ్లాక్ బస్టర్ల మీద వింటేజ్ ఫీలింగ్ పోతుందని బాధ పడుతున్న ఫ్యాన్స్ లేకపోలేదు. ఒకేసారి రెండు రావడం వల్ల సెలెబ్రేషన్స్ పరంగా అదనపు భారం పడుతుందని, అది గుర్తించకుండా ఎవరికి వారు అనౌన్స్ మెంట్లు ఇచ్చుకుంటూ పోవడం ఏమిటని వాపోతున్నారు. ఇప్పటికే మురారి, ఒక్కడు రెండేసి రౌండ్లు పూర్తి చేసుకోగా ఇప్పుడు మిగిలినవి కూడా అదే బాట పట్టనున్నాయి.
చూస్తుంటే రాబోయే రోజుల్లో నాని, బాబీ, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్లు కూడా ఇదే వరసలో తీసుకొచ్చేలా ఉన్నారు. మహేష్ ఫిల్మోగ్రఫీలో మరోసారి ఇలా సందడి చేసే ఛాన్స్ ఉన్న సినిమాలు రాజకుమారుడు, టక్కరి దొంగ మాత్రమేనని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. కాస్త ట్రిమ్ చేస్తే నిజం కూడా బాగానే ఉంటుందని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఇకపై ఈ రీ రిలీజులకు పరిమితి విధించడం అవసరం. ఇవి కొన్నిసార్లు కొత్త సినిమాలను దెబ్బ తీస్తున్నాయి.
This post was last modified on May 31, 2026 10:09 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…