మెగా వేలంలో ఎవరూ కొనని ఒక ఆటగాడు, ఏకంగా ఒక ఫ్రాంచైజీ తలరాతనే మారుస్తాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. 2022 వేలంలో రజత్ పటీదార్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. ఆ సమయంలో లవ్‌నీత్ సిసోడియా గాయపడటంతో, మిడ్ సీజన్ రీప్లేస్‌మెంట్‌గా ఆర్సీబీ అతన్ని జట్టులోకి తీసుకుంది. ఈ అవకాశం కోసం పటీదార్ ఏకంగా తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయం అతని కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది.
జట్టులోకి వచ్చిన వెంటనే లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 2022 ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటీదార్ తన సత్తా ఏంటో చూపించాడు. కేవలం 54 బంతుల్లోనే అజేయంగా 112 పరుగులు సాధించి, ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో గాయం కారణంగా 2023 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయినా సరే ఏమాత్రం నిరాశపడకుండా మళ్లీ బలంగా పుంజుకున్నాడు.
గాయం నుంచి కోలుకున్నాక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఏకంగా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2023 డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాపై వన్డేల్లో, 2024లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. క్రీజులో ఎంత ఒత్తిడి ఉన్నా చాలా కూల్‌గా ఉండటం పటీదార్ స్పెషాలిటీ. అనవసరమైన హడావుడి చేయకుండా, తన ప్రశాంతమైన బ్యాటింగ్‌తో ఎన్నోసార్లు ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను ఆదుకున్నాడు.
అతని నిలకడైన ఆటతీరును గుర్తించిన ఆర్సీబీ, 2025 సీజన్ ముంగిట ఏకంగా రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుని జట్టు కెప్టెన్సీని అప్పగించింది. ఆ బాధ్యతను కూడా పటీదార్ చాలా సైలెంట్ గా, స్వార్థం లేకుండా నిర్వర్తించాడు. పరిస్థితులు చేయిజారుతున్నట్లు అనిపించినా ఎక్కడా సహనం కోల్పోకుండా జట్టును ముందుండి నడిపించాడు.
బ్యాటర్‌గానే కాకుండా ఒక నాయకుడిగా తన మార్క్ చూపించాడు. పటీదార్ కూల్ కెప్టెన్సీ ఆర్సీబీకి 18 ఏళ్ల కల అయిన తొలి ఐపీఎల్ టైటిల్‌ను అందించింది. కనీసం బేస్ ప్రైస్‌కు అమ్ముడుపోని స్థాయి నుంచి, అదే జట్టుకు కెప్టెన్‌గా మారి కప్పు గెలిపించే స్థాయికి ఎదగడం నిజంగా ఒక అద్భుతం. అదే గెలుపును కొనసాగిస్తూ 2వ సారి కూడా ఛాంపియన్ గా నిలబెట్టడం విశేషం.
This post was last modified on June 1, 2026 12:39 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…