Movie News

మెగా సినిమాల మీదే యువి భారం

మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్ తో తీసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’కు ప్రశంసలు కాసిన్ని డబ్బులు వచ్చాయి కానీ మరీ బ్లాక్ బస్టర్ అంత రేంజ్ కాలేకపోయింది. గత ఏడాది అనుష్క ‘ఘాటీ’ డిజాస్టర్ కావడం పెద్ద దెబ్బ. శర్వానంద్ ‘బైకర్’కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ అది బాక్సాఫీస్ వద్ద క్యాష్ కాలేకపోయింది. పేరు గొప్పనే సంతృప్తి మాత్రమే మిగిలింది.

ఇదిలా ఉండగా యువి నుంచి ఇప్పుడు రెండు సినిమాలు రెడీగా ఉన్నాయి. మొదటిది విశ్వంభర. నాన్నా పులి కథలో చెప్పినట్టు విఎఫ్ఎక్స్ గురించే వాయిదాలు వేస్తున్నామని చెబుతున్నారు కానీ ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ ఇవ్వడం లేదు. ఓటిటి డీల్ ఆశించిన స్థాయిలో జరగకపోవడం వల్లే లేట్ అయ్యిందని ఇన్ సైడ్ టాక్ ఉండగా మన శంకరవరప్రసాద్ గారు సక్సెస్ ని వాడుకునే ఛాన్స్ ఇలా వృథాగా పోవడం మెగా ఫ్యాన్స్ ని బాధిస్తోంది.

మరొకటి కొరియన్ కనకరాజు. ఆల్రెడీ ఒక టీజర్, పాట వచ్చేశాయి. తర్వాత అంతా సైలెంట్. దీనికీ డిజిటల్ చిక్కుముడి థియేటర్ విడుదలకు అడ్డం పడిందని సమాచారం. గత డిజాస్టర్ల ప్రభావం వరుణ్ తేజ్ మార్కెట్ మీద బాగా ప్రభావం చూపిస్తోంది. మట్కా, ఆపరేషన్ వాలెంటైన్, గని కనీస స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవడం ఈ పరిస్థితికి కారణం. దర్శకుడు మేర్లపాక గాంధీ ట్రెండింగ్ లో లేని డైరెక్టర్ కావడం బిజినెస్ పరంగా మరో అడ్డంకి,.

ఇవి బయటికి వచ్చి హిట్ అయితే యువికి పెద్ద స్వాంతన చేకూరుతుంది. ప్రభాస్ అండదండలు ఉన్నప్పటికీ అవి అందిపుచ్చుకోవడంలో దురదృష్టం వెంటాడుతోంది. సాహో, రాధే శ్యామ్ ని అంత పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తే రిజల్ట్స్ నిరాశ పరిచాయి. సో ఇప్పుడు ఆదుకునే సినిమా ఒకటి పడాలి. వీటి వల్లే అఖిల్ తో ప్లాన్ చేసుకున్న ప్యాన్ ఇండియా మూవీని పక్కన పెట్టిన యూవీకి కోరుకున్న బ్రేక్ ఏ మెగా హీరో ఎప్పుడు ఇస్తారో రిలీజయ్యే వరకు వెయిట్ చేయాలి.

This post was last modified on May 31, 2026 11:58 pm

Share

Recent Posts

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

13 minutes ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

1 hour ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

2 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

2 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

3 hours ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

4 hours ago