Movie News

బుచ్చిబాబు మీద నమ్మకం ఎంత ఉందంటే

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ చేసేదే. అయితే అభిమానులు స్వంతంగా తయారు చేయించేవి మాత్రం కేవలం హీరోకు మాత్రమే పరిమితమవుతాయి. అలాంటిది బుచ్చిబాబు మీద ఫ్యాన్స్ ఏ స్థాయిలో నమ్మకం పెట్టుకున్నారంటే కుస్తీ పైల్వాన్ గెటప్ కి ప్రత్యేకంగా తన తలను అతికించి వేదిక దగ్గర హల్చల్ చేసేస్తున్నారు. ఈ మినీ కటవుట్ బాగా వైరల్ అవుతోంది.

ఇలా ఎందుకు చేశారంటే కేవలం బుచ్చిబాబు మీద ఉన్న నమ్మకంతోనే. రామ్ చరణ్ పెద్ది కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. శరీరాన్ని గాయపరిచి చేతులు కాళ్ళు విరగ్గొట్టుకున్నాడు. రిలీజ్ కోసం సర్జరీ వాయిదా వేసుకున్నాడు. రెండేళ్లు ఈ ప్రాజెక్టు మీదే ఉన్నాడు. చాలా రిస్కులు తీసుకున్నాడు. డూపులు వద్దని ఫైట్లు చేయడమే కాదు ప్రమాదకరమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణలో పాల్గొన్నాడు. ఇదంతా అప్డేట్స్ రూపంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ చూస్తూనే వచ్చారు.

బుచ్చిబాబు వినయం, గ్రౌండెడ్ గా అనిపించే ప్రవర్తన జనాలకు బాగా రీచ్ అయిపోయింది. ఫిల్టర్స్ లేకుండా, అతిశయోక్తి అనిపించకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడ్డం చాలా మందిని ఆకట్టుకుంది. అందులోనూ చరణ్ మీద చూపించిన విపరీతమైన ప్రేమ మెగాభిమానులను టచ్ చేసింది. అందుకే పెద్ది విషయంలో అంత ధీమాగా ఉన్నారు. విజయవాడ ఈవెంట్ లో బుచ్చిబాబు ఏం ఎమాట్లాడతాడనే ఎగ్జైట్ మెంట్ వాళ్ళలో ఎక్కువగా ఉంది.

ఇప్పుడీ సినిమా కనక బ్లాక్ బస్టర్ చేసి చూపిస్తే బుచ్చిబాబు నేరుగా టాప్ లీగ్ లోకి వెళ్ళిపోతాడు. ఎవరితో చేయాలనుకున్నా డేట్లు దొరుకుతాయి. పైగా తన కోసం స్టార్లు ఎదురు చూసే పరిస్థితి రావొచ్చు. ఉప్పెన తర్వాత ఇంత గ్యాప్ వచ్చినప్పటికి బుచ్చిబాబు ఓపికగా ఉన్నది పెద్దితో పెద్ద విజయం అందుకుని గురువు సుకుమార్ స్థాయిలో ముద్ర వేయాలనే. మరి ఈ కసి, తపన ఎంత మేరకు ఫలితం ఇస్తాయో తెలియాలంటే జస్ట్ నాలుగు రోజులు ఆగితే చాలు.

This post was last modified on May 31, 2026 10:03 pm

Share

Recent Posts

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

17 minutes ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

2 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

2 hours ago

టీడీపీకి 58 కోట్లు.. వైసీపీకి 24 కోట్లు.. బీఆర్ ఎస్‌కు 16 కోట్లు..

భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…

3 hours ago

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

6 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

6 hours ago