గత కొన్నేళ్లుగా నిర్మాతలను బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య ఓవర్సీస్ ప్రీమియర్లు. టైంకి డేటా పంపలేకపోవడం, హార్డ్ డిస్క్ రవాణాలో ఎదురయ్యే సమస్యల వల్ల కొన్ని సార్లు షోలు క్యాన్సిల్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఓజి టైంలో స్వయంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొరియర్ బాయ్స్ గా మారాల్సి వచ్చింది. కింగ్డమ్ టైంలో నిర్మాత ఎదురుకున్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. పెద్దికి కూడా అలా జరుగుతుందేమోననే అనుమానాలు అభిమానులకు రావడం సహజం.
అయితే అలాంటి టెన్షన్ లేకుండా పెద్ది కంటెంట్ డెలివరీ జరిగిపోయింది. సోమవారానికి హార్డ్ డ్రైవ్స్ అన్నీ చేరబోతున్నాయి. తెలుగు పూర్తయిపోగా హిందీ, తమిళ మలయాళం అదే వరసలో ఉన్నాయి. ఒక్క నిమిషం ఆలస్యం లేకుండా పెద్ది షోలు టైంకి పడటంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఏపీలో జూన్ 3 రాత్రి 8 గంటలకు ఒక షో అనుమతి వచ్చేసిన నేపథ్యంలో తెలంగాణ పర్మిషన్ల కోసం వృద్ధి మేకర్స్ ఎదురు చూస్తున్నారు. రేపో ఎల్లుండో రావొచ్చు.
ఏరియాల వారీగా థియేటర్ అగ్రిమెంట్లు జరిగిపోతున్నాయి. నైజామ్ లో ఎస్విసికి సంబంధించి నటరాజ్ థియేటర్ విషయంలో తలెత్తిన వివాదం వల్ల చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కాగానే ఫుల్ లిస్టు రేపటికి వచ్చేస్తుందని అంటున్నారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం పెంపుకి అనుమతి ఇవ్వకపోతే రెగ్యులర్ రేట్లతోనే బుకింగ్స్ ఓపెన్ చేస్తారు. అంతర్గత వర్గాలు మాత్రం ఎస్ అనే సంకేతాలు ఇస్తున్నాయి. రేపటికి క్లారిటీ రావొచ్చు.
విజయవాడలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ మీదే అందరి కళ్ళు ఉన్నాయి. ట్రైలర్, ఐటెం సాంగ్ తర్వాత అంచనాలు హెచ్చుతగ్గులకు గురి కావడంతో ఫ్యాన్స్ ఆందోళన టెన్షన్ పడుతున్న మాట వాస్తవం. వాటిని తగ్గించేలా ఢిల్లీ, చెన్నై, బెంగళూరు ఈవెంట్లలో టీమ్ సభ్యులు కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఓపెనింగ్స్ రికార్డుల విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు కానీ పాజిటివ్ టాక్ రావడం ఒకటే పెండింగ్. ప్రీమియర్ షో పడేలోపు మిలియన్ మార్క్ అందుకోవచ్చని ఒక అంచనా.
This post was last modified on May 31, 2026 2:26 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…