తమ సినిమాల ప్రమోషన్ కోసం తెలుగు రాష్ట్రాలకు వచ్చినపుడు.. తెలుగులో సినిమా చేయాలనుందని, త్వరలోనే చేస్తానని తమిళ హీరోలు చెప్పడం ఎన్నో ఏళ్ల నుంచి జరుగుతున్నదే. కానీ ఒకప్పుడు కమల్ హాసన్ తెలుగులో నిలకడగా సినిమాలు చేశాడు కానీ.. ఆయన తర్వాత కొత్త తరం హీరోలు తెలుగు వైపు చూడలేదు. కానీ చాాలా ఏళ్ల తర్వాత ఈ ట్రెండును పున:ప్రారంభించిన ఘనత యువ కథానాయకుడు కార్తిదే.
‘ఆవారా’, ‘నా పేరు శివ’ లాంటి చిత్రాలతో తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అతను.. తన కంటే ముందు తెలుగులో మార్కెట్ సంపాదించిన అన్న సూర్య కంటే ముందు ఇక్కడి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. 2016లో అక్కినేని నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ లాంటి మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలిచాడు. ఆ చిత్రంలో కార్తి పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే ఇక్కడ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ తర్వాత మళ్లీ ఇంకో తెలుగు సినిమా చేయలేదు కార్తి.
ఐతే పదేళ్ల తర్వాత ఇప్పుడు అతను తెలుగులో సినిమాను మొదలుపెట్టడం విశేషం. ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్‌తో చేతులు కలిపాడు కార్తి. వీరి కలయికలో సినిమా రాబోతున్న సంగతి ఇంతకుముందే వెల్లడైంది. ఈ చిత్రంలో కార్తి సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది.
ఇప్పటికే కార్తి అన్న సూర్యతో ‘విశ్వనాథం అండ్ సన్స్’, అంతకంటే ముందు మరో తమిళ హీరో ధనుష్‌తో ‘సార్’ సినిమాలను నిర్మించిన సూర్యదేవర నాగవంశీ.. ఓ తమిళ హీరోతో ముచ్చటగా మూడో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
నిజానికి కార్తి ఈ చిత్రం కంటే ముందు ‘హిట్-4’ చేస్తాడని భావించారు. నాని సినిమా ‘హిట్-3’లో అతను చివర్లో క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. అది ‘హిట్-4’కు లీడ్ సీన్. ఐతే ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్లడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. ఈలోపే కళ్యాణ్ శంకర్, నాగవంశీ కాంబినేషన్లో సినిమాను మొదలుపెట్టాడు.
This post was last modified on May 25, 2026 2:54 pm
కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్కసారిగా పడిపోయింది. వాస్తవానికి గత ఏడాదే ఆయన ప్రజాదరణ తగ్గుముఖం…
టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…
సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…
ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…