Movie News

ఢిల్లీ ఎపిసోడ్ అంత కీలకమా

పెద్ది గురించి ఈ మధ్య ఎక్కువగా వింటున్న మాట క్లైమాక్స్. చివరిలో చాలా ఎమోషనల్ అవుతారని, ఎంత కమర్షియల్ సినిమా అయినా భావోద్వేగాలను అణుచుకోలేరనే స్థాయిలో దర్శకుడు బుచ్చిబాబు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎవరూ చేయని రిస్క్ చరణ్ చేశాడంటూ యూనిట్ వర్గాలు అక్కడక్కడా లీకులు ఇస్తూ వచ్చాయి. ఉప్పెనకి వంద రెట్లు ఎక్కువ షాక్ వేల్యూ దీంట్లో ఉంటుందని స్వయంగా హీరో చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసింది.

అంతర్గత వర్గాల కథనం ప్రకారం ఢిల్లీ ఎపిసోడ్ సుమారు నలభై అయిదు నిమిషాలకు పైగానే ఉంటుందట. భాష రాకపోయినా ఒక ఉన్నత లక్ష్యం కోసం దేశ రాజధాని చేరుకున్న పెద్దికి ఎదురయ్యే అవమానాలు, వాటిని అతను ఎదురుకున్న విధానం రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా చాలా డీప్ గా టచ్ చేసేలా ఉంటుందట. సుమారు ఇరవై నిమిషాల పాటు ఇది చరణ్ సినిమానా లేక మణిరత్నం, గౌతమ్ మీనన్ తీశారా అనిపించేలా చాలా లోతుగా వెళ్లినట్టు చెబుతున్నారు.

కమర్షియల్ స్కేల్ ని ఢిల్లీ ఎపిసోడ్ ప్రభావితం చేస్తుందని లోపలి నుంచి వినిపిస్తున్న మాట. ఇది కనక క్లిక్ అయితే రవికిషన్ అన్నట్టు అవార్డులతో పాటు రిపీట్ వేల్యూతో అభిమానులను కట్టి పారేయడం ఖాయం. ఢిల్లీకి వెళ్లే ముందు ఒక మాస్ ప్యాకేజ్, ఢిల్లీకి చేరుకున్నాక ఒక క్లాస్ భోజనం తరహాలో బుచ్చిబాబు రెండు బ్యాలన్స్ చేశారని తెలిసింది. ఏఆర్ రెహమాన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో వీటికి ఎలా ప్రాణం పోస్తాడనే దాని మీద కనెక్టివిటీ ఆధారపడి ఉంది.

ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే చేతిలో కేవలం తొమ్మిది రోజులే ఉండటంతో పెద్ది బృందం పరుగులు పెడుతోంది. చెన్నైలో చివరి దశ పనులు చూసుకుంటూ బుచ్చిబాబు బిజీగా ఉండగా, నిర్మాత ఇక్కడ నైజం సింగల్ స్క్రీన్ల వివాదం మళ్ళీ ఏర్పడ్డ నేపథ్యంలో దాన్ని అత్యవసరంగా పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. జూన్ 3 ప్రీమియర్ షోలు వేస్తారా లేదానే క్లారిటీ ఇంకా రాలేదు. తెలంగాణలో ఉంటాయనే హామీ దొరికాకే ఏపీ షోల గురించి ప్రకటన వస్తుంది.

This post was last modified on May 25, 2026 7:08 am

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

5 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

9 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

11 hours ago