Political News

ఫ్యూచర్ సిటీపై రచ్చరచ్చ!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్న ఫ్యూచర్ సిటీ అంశంపై ఇప్పుడు రాష్ట్రంలో రచ్చ చోటుచేసుకుంది. ఈ రచ్చకు బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కారణం కాగా… ఆయనకు సమాధానం ఇచ్చే దిశగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు తమదైన శైలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెరసి ఫ్యూచర్ సిటీ వ్యవహారంపై శనివారం తెలంగాణలో రచ్చ చోటుచేసుకుంది.

బీఆర్ఎస్ సర్కారు హయాంలో హైదరాబాద్ నగరానికి ఓ వైపున ఉన్న ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటు చేయనున్నట్లు నాటి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ఓ మోస్తరు అడుగులు పడినా… ఆ వెంటనే ఎన్నికలు రావడంతో అవన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఎన్నికల్లో అదికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్యూచర్ సిటీకి ప్రత్యేకంగా భూసేకరణ జరగని నేపథ్యంలో ఫార్మా సిటీ స్థానంలోనే ఫ్యూచర్ సిటీ నిర్మించనున్నట్లుగా తేలింది.

ఈ విషయంపై అదికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణను ఆర్థికంగా పరిపుష్టం చేసే ఫార్మా సిటీని పక్కనపెట్టేసిన రేవంత్ రెడ్డి సర్కారు… ఆ భూముల స్థానంలో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడితో ఆగని హరీశ్… తాము అధికారంలోకి వస్తే.. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని, ఆ భూములను ఫార్మా సిటీకే కేటాయిస్తామని అన్నారు.

ఈ మాటలు విన్నంతనే కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. ముందుగా రంగంలోకి దిగిన మంత్రి కోటమిరెడ్డి వెంకటరెడ్డి… హరీశ్ రావు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ కు అసలు ఫ్యూచరే లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచరే లేని పార్టీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తుందట అని ఆయన సెటైరికల్ కామెంట్లు వదిలారు. బీఆర్ఎస్ లో హరీశ్ రావుకే ఫ్యూచర్ లేదన్న కోమటిరెడ్డి… ఫ్యూచర్ సిటీ రద్దు కాదు, ముందు మీ ఫ్యూచర్ చూసుకోండి అంటూ హరీశ్ కు సూచించారు.

ఇక పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రంగంలోకి దిగి హరీశ్ రావు వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేసే ధైర్యం బీఆర్ఎస్ కు లేదని, భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవని ఆయన జోస్యం చెప్పారు.

ఓ బాధ్యత కలిగిన మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు… ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రకటించడం దారుణమని ఆయన అన్నారు. ఫ్యూచర్ సిటీకి ఎప్పటికీ ముప్పు వచ్చే పరిస్థితి లేదన్న శ్రీధర్ బాబు… ఫ్యూచర్ సిటీలోనే ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. మొత్తంగా ఫ్యూచర్ సిటీపై అటు విపక్షం, ఇటు అదికార పక్షం నేతల మధ్య రచ్చ ఓ రేంజిలో సాగుతోందని చెప్పాలి.

This post was last modified on May 24, 2026 10:40 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

3 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

4 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

5 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

8 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

9 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

10 hours ago