Movie News

పెద్ది తరువాత బుచ్చిబాబు దారెటు?

2021లో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బుచ్చిబాబు సన మొదటి అడుగులోనే వంద కోట్ల మార్క్ అందుకున్నాడు. డెబ్యూ డైరెక్టర్ కు అంతటి భారీ సక్సెస్ వస్తే వెంటనే నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టేస్తుంటారు. కానీ బుచ్చిబాబు రూటే సెపరేట్ అని ఆయన తీసుకున్న గ్యాప్ చూస్తేనే అర్థమవుతోంది. రెండో సినిమా పెద్ది ఆడియన్స్ ముందుకు రావడానికి ఏకంగా ఐదేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా రిలీజ్ కు రెడీ అవుతున్న వేళ ఇండస్ట్రీలో ఆయన మూడో ప్రాజెక్ట్ పై అప్పుడే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

పెద్ది సినిమా రిజల్ట్ బుచ్చిబాబు కెరీర్ కు అత్యంత కీలకం కాబోతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కనక అనుకున్న స్థాయిలో హిట్ అయితే డైరెక్టర్ లీగ్ పూర్తిగా మారిపోతుంది. ఒకవేళ పెద్ది కనక పాన్ ఇండియా రేంజ్ లో రికార్డులు కొడితే మూడో సినిమాను కూడా అదే స్థాయిలో ప్లాన్ చేయాలనే ఆలోచన రావడం సహజం. మళ్ళీ బడా హీరోతోనే ప్రాజెక్ట్ సెట్ చేయాలని ఆయన తపన పడతాడు.

అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ ఎవరూ ఖాళీగా లేరు. ప్రతి ఒక్కరి డైరీ రాబోయే రెండేళ్ల వరకు ఫుల్ గా ప్యాక్ అయి ఉంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్లతో స్టార్స్ అంతా బిజీగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బుచ్చిబాబు ముందున్న ఆప్షన్స్ రెండే. బడా హీరో డేట్స్ దొరికే వరకు మరో రెండేళ్లు సైలెంట్ గా వెయిట్ చేయడం ఒక ఆప్షన్.

అయితే ఒక దర్శకుడు కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఐదేళ్లకు ఒక సినిమా తీయడం అనేది కమర్షియల్ గా పెద్ద మైనస్ అవుతుంది. ఈ జనరేషన్ లో ఆడియన్స్ టేస్ట్ లు చాలా వేగంగా మారిపోతున్నాయి. అలాగని చిన్న హీరోతో సినిమా చేసి తన మార్కెట్ ను తగ్గించుకోలేడు. టాలీవుడ్ లో డేట్స్ దొరకకపోతే బుచ్చిబాబు కోలీవుడ్ వైపు చూసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఈమధ్య కాలంలో మన డైరెక్టర్లు తమిళ స్టార్స్ తో సినిమాలు చేయడం బాగా ట్రెండ్ అవుతోంది.

పెద్ది హిట్ అయితే కోలీవుడ్ లోని టాప్ హీరోలు బుచ్చిబాబుతో పని చేయడానికి కచ్చితంగా ఆసక్తి చూపిస్తారు. సూర్య, కార్తి, లేదా శివకార్తికేయన్ లాంటి హీరోలకు ఒక పక్కా విలేజ్ మాస్ స్టోరీ చెబితే ప్రాజెక్ట్ చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. పైగా పాన్ సౌత్ అప్పీల్ ఉన్న హీరో దొరికితే మార్కెట్ పరంగా కూడా ఎలాంటి ఢోకా ఉండదు. ఏదేమైనా ఇప్పుడు ఇండస్ట్రీ కళ్లన్నీ పెద్ది రిజల్ట్ మీదే ఉన్నాయి. ఆ సినిమా బాక్సాఫీస్ ఫలితం ఆధారంగానే ఆయన నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవుతుంది.

This post was last modified on May 23, 2026 5:59 am

Share

Recent Posts

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంత్రుప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

9 minutes ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

1 hour ago

సినిమా షూటింగ్… ఐదుసార్లు చావుకు దగ్గరగా

సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…

6 hours ago

తెలంగాణా కాంగ్రెస్లో టిక్.. టిక్.. టిక్

తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరే ఢిల్లీకి చేరుకుంటున్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత కామెంట్స్ పెట్టిన చిచ్చు, చిన్నారెడ్డి…

9 hours ago

రంభ ఊర్వశి సరే… మరి అప్పట్లో ఎలా

సెన్సార్ విషయంలో నానా ఇబ్బందులు పడిన రంభ ఊర్వశి మేనక ఎట్టకేలకు అడ్డంకిని తొలగించుకుని యు/ఏ సర్టిఫికెట్ తో సెప్టెంబర్…

9 hours ago

అభిమానుల విన్నపం నాగ్ పట్టించుకోలేదా

వందో సినిమా సంబరానికి రెడీ అవుతున్న నాగార్జున కింగ్ 100 కోసం అభిమానులు పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. నా…

10 hours ago