Movie News

వేసవిని వాడుకోలేకపోయిన టాలీవుడ్

టాలీవుడ్ చూసిన అత్యంత బ్యాడ్ సమ్మర్స్ లో 2026 మొదటి స్థానం ఆక్రమించుకునేలా ఉంది. ఎంత మండిపోయే ఎండలు, ఐపీఎల్ క్రికెట్ ఉన్నా జనాలు థియేటర్లలో వినోదాన్ని పొందేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ ఈసారి మంచి సీజన్ సరైన ప్లానింగ్ లేక మన నిర్మాతలు వృథా చేసుకున్నారు. జూన్ 4 పెద్ది వస్తుంది కానీ అక్కడి నుంచి సరిగ్గా వారం రోజులకు స్కూళ్ళు. కాలేజీలు తెరుచుకుంటాయి. అడ్మిషన్లు, ఫీజులు వగైరా హడావిడి చాలా ఉంటుంది. పెద్ద సినిమా కాబట్టి వసూళ్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.

కానీ మీడియం రేంజ్ చిత్రాల ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ప్రణాళిక లేక బంగారు బాతు ఇచ్చే గుడ్లను తీసుకోలేకపోయారు. నిఖిల్ ‘స్వయంభు’ రకరకాల కారణాలతో వాయిదాలు పడుతూనే వస్తోంది. ఫిబ్రవరి నుంచి రెండు డేట్లు మారాక హఠాత్తుగా సైలెంట్ అయిపోయారు. జూలైలో రావడం కూడా డౌటేనేట. సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ ఏవేవో ఇష్యూస్ తో నిర్మాణం నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా వాయిదాల పర్వంలో నలిగిపోతోంది. ఈ సంవత్సరం వస్తుందో రాదో కూడా తెలియదు.

భారీ బడ్జెట్ లతో ముడిపడిన ప్యాన్ ఇండియాల సంగతి సరేకాని డీసెంట్ బడ్జెట్ తో రూపొందినవి కూడా సాహసం చేయలేకపోయాయి. కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి పాజిటివ్ బజ్ ఉన్నా దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ ఏదో ఒక సౌండ్ చేస్తోంది కానీ రిలీజ్ డేట్ తేల్చడం లేదు. అఖిల్ ‘లెనిన్’ జూన్ 26 లాక్ చేసుకుంది కానీ అదేదో కొంచెం ముందు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. సమంత ‘మా ఇంటి బంగారం’ కూడా అంతే. జూన్ 19 వస్తోంది.

ఇంకా లిస్టు పెద్దదే ఉంది కానీ ఇక్కడ చెప్పిన సినిమాలన్నీ కూడా మార్చి నుంచి మే మధ్యలో కనీసం రెండు మూడు వచ్చినా ఇప్పుడు డబ్బింగులను నెత్తిన బెట్టుకునే అవసరం ఉండేది కాదు. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే చిరంజీవి ‘విశ్వంభర’ సైతం విఎఫెక్స్ పేరుతో కాలయాపన చేస్తోంది తప్ప వ్యవహారం తేల్చే ఉద్దేశంలో కనిపించడం లేదు. మార్చిలో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలతో వచ్చి నిరాశపరిచింది. చూడాలి మరి జూన్, జూలై నెలలు ఎలాంటి ఊరట కలిగిస్తాయో.

This post was last modified on May 23, 2026 10:36 am

Share

Recent Posts

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

1 minute ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

3 minutes ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

1 hour ago

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

3 hours ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

4 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

6 hours ago