Movie News

రేపేమో శుక్రవారం… సౌండేమో అంతంతమాత్రం

వేసవిలో కొత్త సినిమాలు రిలీజవుతున్నాయంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. కానీ ఈసారి పెద్ద హీరోలెవరూ జూన్ వరకు అందుబాటులోకి రాకపోవడంతో చిన్న చిత్రాలతో బాక్సాఫీస్ ఎదురీదుతోంది. మధ్యలో ఒకటి రెండు ఎడారిలో నీటి జల్లులా కొన్ని తుంపర్లు కురిపిస్తున్నాయి కానీ బయ్యర్లలో జోష్ తీసుకురావడానికి సరిపోవడం లేదు. రేపు మరో శుక్రవారం వస్తోంది . వీలైనంతలో ప్రచారం ద్వారా సౌండ్ చేయడానికి ట్రై చేస్తున్నాయి కానీ అవి జనాలకు చేరడానికి టైం పడుతోంది.

సైక్ సిద్దార్థ తర్వాత నందు సోల్ హీరోగా నటించిన మూవీ ‘అగ్లీ స్టోరీ’. పేరులోనే కాదు ట్రైలర్ లోనే కాన్సెప్ట్ ఏంటో చూపించారు కాబట్టి ఇది పెద్దలకే పరిమితం. వాళ్ళను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి. కామెడీనే నమ్మకుని వింటేజ్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తామని ‘పురుషః’ టీమ్ పదే పదే చెబుతోంది. కొత్త హీరోతో పాటు వెన్నెల కిషోర్, సప్తగిరి, కసిరెడ్డి లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కనక భార్యల వల్ల నరకం చూసే భర్తల పాట్లు ఏ మేరకు కన్విన్స్ చేస్తాయో వెయిట్ చేయాలి.

మరో చిన్న మూవీ ‘రమణి కళ్యాణం’ పేరుతోనే ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన వైనం. గ్రౌండ్ లో బజ్ మాత్రం అంతంత మాత్రమే. పరిస్థితి ఎలా ఉందంటే కొత్త సినిమాల కౌంట్ తో సమానంగా రీ రిలీజులు ఉన్నాయి. వర్కౌట్ అవుతాయా లేదానేది చూడకుండా ఊసరవెల్లి, ఆంధ్రావాలా, కృష్ణని దించారు. జనాలు లైట్ తీసుకున్నారు. మన్మథుడుకి కొన్ని పరిమిత షోలను ప్లాన్ చేసుకున్నారు. ఆడియన్స్ ఉన్నఫళంగా దేనికి ఎగబడి సీన్ లేదని చెప్పొచ్చు.

ఉన్నంతలో డబ్బింగ్ సినిమా అయినా సరే ‘దృశ్యం 3’కే జనాలు కనిపిస్తున్న మాట వాస్తవం. టాక్ యునానిమస్ గా లేకపోవడం ఏ మేరకు ఎఫెక్ట్ ఇస్తుందో చూడాలి. జూన్ 4 పెద్ది వస్తున్న నేపధ్యములో దానికి దగ్గరగా తమ రిలీజులు పెట్టుకునే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. అందుకే నెక్స్ట్ ఫ్రైడే ఏదైనా రిలీజ్ ఉన్నా వాటి ప్రభావం తక్కువగానే ఉండబోతోంది. మరి రేపటి సినిమాల్లో ఒకటో రెండో కాస్త డీసెంట్ టాక్ తెచ్చుకుంటే గోదారి గట్టుపైన తరహాలో ఎంతో కొంత బండి లాగొచ్చేమో.

This post was last modified on May 21, 2026 9:23 pm

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

25 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

31 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

45 minutes ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

1 hour ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

4 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

5 hours ago