పెద్ది ప్రమోషన్లలో భాగంగా కారు డ్రైవ్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు పరస్పరం మాట్లాడుకుంటున్న వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ఢిల్లీ ఎపిసోడ్ తనకు వ్యక్తిగతంగా చాలా బాగా నచ్చిందని, ఉప్పెనకు వంద రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చే క్లైమాక్స్ అవుతుందని బలంగా నొక్కి చెప్పాడు. అంటే అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు సైతం ఊహించలేని పెద్ద మలుపేదో బిగ్ స్క్రీన్ మీద షాక్ ఇవ్వబోతుందని అర్థమయ్యింది.
అయితే రామ్ చరణ్ ఇచ్చింది ఆషామాషీ స్టేట్ మెంట్ కాదు. తనొక్కడే కాదు టీమ్ మెంబెర్స్ చాలా మంది తమ ఇంటర్వ్యూలలో చివరి ఘట్టం గురించి పదే పదే నొక్కి వక్కాణించారు. గత రెండేళ్లుగా ఎవరైనా ఇలా మరీ ఎగ్జాగరేట్ చేసి చెప్తే నమ్మలేని పరిస్థితి వచ్చింది. ప్రమోషన్లనో చెప్పేది ఒకటి తెరపై కనిపించేది మరొకటి అన్నట్టుగా సిచువేషన్ మారిపోయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో క్లైమాక్స్ గురించి చెప్పే మాటలకు బాక్సాఫీస్ రిజల్ట్ కు పొంతన ఉండటం లేదు
సో ఇప్పుడు చరణ్ తాను అన్నది ఏదో మాట వరసకో పబ్లిక్ అటెన్షన్ కోసమో కాదని నిరూపించాలి. దానికి బాధ్యత బుచ్చిబాబుదే. యూనిట్ అయితే హీరో దర్శకుడు చెబుతున్న దాంట్లో నిజం ఉందని, ఇప్పటిదాకా తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి అరుదైన క్లైమాక్స్ చూసి ఉండరని, తెగ ఊరిస్తున్నారు. పెద్ది సెల్లింగ్ పాయింట్స్ లో ఇప్పుడిది కీలకంగా మారింది. ఇంతగా చరణ్ చెబుతున్నారంటే జనం రకరకాలుగా ఊహించుకుంటున్నారు.
ట్రైలర్ కొచ్చిన మిశ్రమ స్పందన చూశాక కొంత నెమ్మదించిన పెద్ది టీమ్ ఇప్పుడు పలు నగరాల్లో ఈవెంట్లు చేయడం ద్వారా బజ్ అమాంతం పెంచే పనిలో ఉన్నారు. ట్రైలర్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ విషయంలో కించిత అనుమానం అక్కర్లేదు. ఆల్రెడీ బిసి సెంటర్స్ బిజినెస్ జరుగుతోంది. టికెట్ రేట్ల ధర పెంపు ఏపీలో ఎలాగూ వస్తుంది కాబట్టి రెవిన్యూ పరంగా పెద్ద నెంబర్లు నమోదవుతాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన పెద్దికి ఏఅర్ రెహణం సంగీతం ప్రధాన ఆకర్షణ కానుంది.
This post was last modified on May 21, 2026 4:53 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…