Movie News

తమన్ సంగీతానికి ‘మెగా’ ఛాలెంజ్

వరసగా బాలకృష్ణ సినిమాలకు పనిచేస్తూ ఇంటి పేరు నందమూరి అనిపించుకున్న తమన్ గతంలో గాడ్ ఫాదర్ రిలీజైనప్పుడు ఒక మాట అన్నారు. ఇది సీరియస్ పొలిటికల్ సబ్జెక్టు కాబట్టి మ్యూజిక్ పరంగా తనకు ఎక్కువ స్కోప్ దక్కలేదని, అదే ప్రాపర్ కమర్షియల్ సబ్జెక్టు కనక పడితే చిరంజీవి మీద ఎంత ప్రేమ ఉందో నిరూపిస్తానని ఛాలెంజ్ చేశారు, బ్రూస్ లీ ఫ్లాప్ అయినప్పటికీ అందులో చిరు క్యామియోకి తమన్ కంపోజ్ చేసిన బీజీఎమ్ ని ఉదాహరణగా చెప్పారు.

ఇప్పుడది తీర్చుకునే టైం వచ్చింది. వాల్తేరు వీరయ్య కాంబోని రిపీట్ చేస్తూ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో రూపొందుతున్న మెగా 158 మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ లాక్ అయ్యాడు. ఆ మధ్య ఏఆర్ రెహమాన్ పేరు వినిపించింది కానీ ఫైనల్ గా బంతి తమన్ కే చేరింది. అయితే వాల్తేరు వీరయ్యకు అదిరిపోయే వర్క్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ని కాదని బాబీ తమన్ కు ఓటు వేయడం గమనించాల్సిన విషయం. వీళ్ళ కలయికలో గతంలో వెంకీ మామ వచ్చింది.

మెగా హీరోలకు తమన్ నుంచి వరసగా బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ పడటం లేదు. గేమ్ ఛేంజర్ డిజాస్టర్ అవ్వడం పక్కనపెడితే అందులో ఒక్కటి తప్ప మిగిలినవి మాములు సాంగ్స్ అనిపించాయి. ఓజిలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు కానీ ఐటెం సాంగ్ లాంటివి కంపోజింగ్ కోణంలో నిరాశనే మిగిల్చాయి. అంతకు ముందు భీమ్లా నాయక్, బ్రో, వకీల్ సాబ్ ఇవేవి అవుట్ స్టాండింగ్ అనిపించుకోలేదు. రామ్ చరణ్ తో చేసినవి కూడా సోసో ఫలితాలు ఇచ్చినవే.

సో ఆ బాకీనంతా తమన్ తీర్చేసుకోవాలి. కాకపోతే ప్రస్తుతం బాబీ రాసుకున్న కథ రెగ్యులర్ పంధాలో ఉండదట. అంటే వరప్రసాద్ లాగా హీరోయిన్ తో డ్యూయెట్లు గట్రా ఉండకపోవచ్చు. పైగా టీనేజ్ అమ్మాయి అనస్వర రాజన్ తండ్రిగా చిరు కనిపించబోతున్నారు. అయినా సరే కోల్కతా మాఫియా డాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కాబట్టి కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఓజిని మించిన అవుట్ ఫుట్ ఇస్తే కనక మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతారు. దీని ఓపెనింగ్ రేపే జరగనుంది.

This post was last modified on May 20, 2026 5:50 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

9 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago