ఎన్నో ఏళ్ల ఫ్లాపుల పరంపరకు ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజైన నారీ నారీ నడుమ మురారి చిత్రంతో తెరదించాడు చార్మింగ్ స్టార్ శర్వానంద్. గట్టి పోటీలో రిలీజై కూడా ఆ సినిమా మంచి ఫలితాన్నందుకుని శర్వాకు గొప్ప ఉపశమనాన్ని అందించింది. దీని తర్వాత తన శైలికి పూర్తి భిన్నంగా ఊర మాస్ అవతారంలో భోగి సినిమా చేశాడు శర్వా. మాస్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకుడు.
ఎప్పుడో ఆగస్టు చివరి వారంలో రావాల్సిన సినిమా ఇది. తర్వాత నవంబరు 12కు వాయిదా పడింది. కానీ ఆ డేట్‌లో కూడా సినిమాను రిలీజ్ చేయలేకపోయారు. సెన్సార్ సహా ఏవో సమస్యలు తలెత్తడంతో మళ్లీ సినిమాను వాయిదా వేయక తప్పలేదు. కొత్త డేట్ కోసం రకరకాల ఆప్షన్లు ప్రయత్నించి.. చివరికి నవంబరు 27కు ఫిక్సయింది టీం. విడుదలకు ఇంకో వారమే సమయం ఉండగా.. ఈ రోజు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
27న రష్మిక మందన్నా క్రేజీ మూవీ మైసా రిలీజవుతోంది. దాంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ హైందవ కూడా రావాల్సి ఉంది. అంత పోటీ మధ్య మళ్లీ భోగి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ 27న హైందవ రావడం సందేహమే అంటున్నారు. ఆ చిత్రాన్ని ఎందుకు వాయిదా వేస్తున్నారు, దాని కొత్త డేట్ ఏంటన్నది స్పష్టత లేదు. కానీ 27న హైందవ రాదన్న సమాచారం మేరకే భోగిని ఆ డేట్‌కు ఖాయం చేసినట్లు తెలుస్తోంది.
సంపత్ నంది మీద అపారమైన నమ్మకంతో అతడితో వరుసగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తున్న సీనియర్ నిర్మాత కె.కె.రాధామోహనే భోగిని కూడా నిర్మించారు. ఇది పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే రా అండ్ రస్టిక్ మూవీ. వయొలెన్స్ ఒక రేంజిలో ఉంటుందని ప్రోమోలు చూస్తే అర్థమవుతోంది. ఈ చిత్రంలో శర్వా సరసన అనుపమ పరమేశ్వరన్ నటించింది. శర్వా కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా అతడికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
This post was last modified on November 20, 2026 7:43 am
గుణ్ణం గంగరాజు.. ఈ పేరు ఈ తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి…
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య అనుబంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ బావ బావమరదులన్న…
తెలంగాణా కాంగ్రెస్ పార్టీలో నిత్యం ఏదో ఒక రగడ కొనసాగుతూనే వుంది. ఒకరుపోతే మరొకరు అసంతృప్తి గళం వినిపించడం మామూలై…
ఇవాళ విడుదలైన ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇండస్ట్రీ దృష్టిలో బలంగా పడటం హాట్ టాపిక్ గా…
ఈ ఏడాది ఆరంభంలో మొదలైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ హైదరాబాద్ సినీ ప్రియుల ఫేవరెట్ స్పాట్లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా…
తెలుగు సినిమాల్లో ఒకప్పుడున్న కామెడీ వైభవం.. ఇండియాలోని ఇతర భాషల్లోనే కాదు, ప్రపంచంలోనే మరే సినీ పరిశ్రమలోనూ లేదు అంటే అతిశయోక్తి…