Political News

బొత్స గారూ… ఏమిటండీ ఇది!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, శాస‌న మండ‌లిలో విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ హ‌వా భారీగా త‌గ్గిపోయిందా? ఆయ‌న గ్రాఫ్ దాదాపు ప‌డిపోయిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు సొంత పార్టీ నాయ‌కులు. త‌న కుమార్తె అనూష‌నుసైతం గెలిపించుకోలేక పోవ‌డం ఒక ఎత్త‌యితే.. తాజాగా సొంత జిల్లా విజ‌య‌న‌గ‌రంలో గురువారం జరిగిన మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో ఎంపీపీల‌ను కూడా గెలిపించుకోలేక పోవ‌డం ఆయ‌న హ‌వాపై తీవ్ర ప్ర‌భావం చూపించింద‌ని అంటున్నారు. ఇది పార్టీగా కంటే కూడా.. వ్య‌క్తిగ‌తంగా కూడా బొత్స‌కు తీవ్ర ఎదురు దెబ్బ‌గా అభివ‌ర్ణిస్తున్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల్లో గురువారం ఎంపీపీల ఎన్నిక జ‌రిగింది. ఇత‌ర జిల్లాల్లో ఎలా ఉన్నా.. బొత్స వంటి బ‌ల‌మైన నాయ‌కుడి జిల్లా విజ‌య‌న‌గ‌రంలో వైసీపీ బోల్తా ప‌డింది. ఇక్క‌డ 27 ఎంపీపీ స్థానాల్లో ఏకంగా 25 టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇది వ్య‌క్తిగ‌తంగా బొత్స‌కు తీవ్ర ప‌రిణామంగా భావిస్తున్నారు. ఆది నుంచి కూడా జిల్లాపై మంచి ప‌ట్టుకున్న బొత్స‌కు ఈ ఎన్నిక‌లు ఒక లెక్క‌లోకి రావ‌ని.. నాయ‌కులు చెప్పారు. కానీ, తీరా ఎన్నిక‌లలో మాత్రం ఆ పార్టీకి తీవ్ర ఎదురు దెబ్బ త‌గిలింది. నిజానికి చీపురుప‌ల్లి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా బొత్స‌కు భారీగా గండి ప‌డింది. ఇది ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం. వ‌రుస విజ‌యాల‌తోపాటు.. ఆయ‌న మాట‌కు తిరుగులేదని అంటారు.

కానీ, చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోనూ టీడీపీ మండ‌లాల‌ను తాజాగా కైవ‌సం చేసుకోవ‌డంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు తీవ్ర ఇబ్బందిగా మారింది. ఒక్క గ‌రివిడి ఎంపీపీ స్థానం మాత్ర‌మే వైసీపీ ఖాతాలో ప‌డింది. జిల్లా మొత్తం మీద వైసీపీకి ద‌క్కిన ఏకైక ఎంపీపీ స్థానం ఇదే. మ‌రోస్థానాన్ని జ‌న‌సేన సొంతం చేసుకుంది. ఇదిలావుంటే.. బొత్స‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న బొంప‌ల్లి వెంక‌ట్రావు.. వైసీపీకి రాజీనామా చేశారు. ఈనెల‌లో జ‌రిగి ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో ఆయ‌న వైసీపీ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్నారు. అనూహ్యంగా ఎన్నిక‌ల రోజు.. ఆయ‌న పార్టీకి గుడ్‌బై చెప్ప‌డం గ‌మ‌నార్హం. త‌న‌కు వైస్ ఎంపీపీ ప‌ద‌విని ఇస్తామ‌ని బొత్స అన్యాయం చేశార‌ని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం.

ఏంటీ ఎంపీపీ ఎన్నిక‌!

మండ‌లాల స్థాయిలో ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన, బీజేపీ అభ్య‌ర్థులు విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. మండ‌ల ప‌రిష‌త్‌కు నేతృత్వం వ‌హించే అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడిని గెలిచిన వారు `చేయి ఎత్త‌డం` ద్వారా ఎన్నుకుంటారు. గురువారం ఈ ఎన్నికే జ‌రిగింది. అయితే..వైసీపీకి బల‌మైన అభ్య‌ర్థులు ఉన్న చోట కూడా.. అనూహ్యంగా టీడీపీ ఎంపీపీల‌ను సొంతం చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ జాబితాలో బొత్స ఇలాకా.. విజ‌య‌న‌గ‌రం ప్ర‌థ‌మ స్థానంలో ఉండడంతో చ‌ర్చ‌కు దారితీసింది.

This post was last modified on November 20, 2026 7:48 am

Share

Recent Posts

తెలుగు సినిమా టైమొచ్చింది

ఓవైపు డబ్బింగ్ సినిమాలేమో ఒక్కొక్కటిగా దున్నేస్తున్నాయి. తెలుగు సినిమాల కంటెంట్ ఏమో వీక్‌గా ఉంటోంది. అవిప్రేక్షకుల ఆదరణకు నోచుకోవడం లేదు.…

18 minutes ago

9 కోట్ల మందు 2.5 లక్షలకే.. ఈవిడే అసలైన డాక్టరమ్మ!

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు మందులు అందుబాటులో ఉన్నా.. వాటి ధర కోట్ల రూపాయల్లో ఉండటంతో తల్లిదండ్రులు చికిత్స చేయించలేని…

1 hour ago

వైసీపీ ఒక డెడ్ బాడీ – నాగబాబు

వైసీపీ మీద మరోసారి విరుచుకొని పడ్డారు ఎమ్మెల్సీ నాగబాబు. వైసీపీ ఒక డెడ్ బాడీ అని, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని…

2 hours ago

హైందవ తప్పుకోవడం నాయుడుకి మంచిదే

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన హైందవ వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కొత్త రిలీజ్ డేట్…

2 hours ago

ఆకాశం నుంచి ప్రశంసల వర్షం

ఒక తెలుగు సినిమాకు యునానిమస్ రివ్యూలు, పబ్లిక్ టాక్ రావడం అరుదు. అది జరిగితే కలెక్షన్లకు అడ్డుకట్ట వేయడం ఎలాంటి…

3 hours ago

లెజెండ్ రీఎంట్రీ… అదిరిపోలా

గుణ్ణం గంగరాజు.. ఈ పేరు ఈ తరం సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ 90వ దశకం నుంచి…

6 hours ago