Movie News

సీక్రెట్స్ దాచని ప్రశాంత్ నీల్…

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్న ఒక రొటీన్ ప్రమోషనల్ మైండ్‌సెట్‌ను ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్ పూర్తిగా మార్చేసింది. రెగ్యులర్ గా ఏ పెద్ద సినిమా టీజర్ వచ్చినా అందులో కేవలం హీరో ఎలివేషన్స్ చూపిస్తూ, కథను మాత్రం అస్సలు రివీల్ చేయకుండా చాలా జాగ్రత్తగా దాచేస్తుంటారు. కానీ దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ పాత ఫార్ములాకు భిన్నంగా వెళ్లారు. సినిమా ప్లాట్ ఏంటి, ఏ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది, అసలు విలన్లు ఎవరు అనే విషయాలను మొదటి రోజే ఓపెన్ గా చూపించి ఇండస్ట్రీకి ఒక రకమైన వార్నింగ్ ఇచ్చారు.

కంటెంట్ మీద పక్కా నమ్మకం ఉంటేనే ఇలాంటి డేరింగ్ స్టెప్ వేయడం సాధ్యమవుతుంది. ప్రేక్షకులను సస్పెన్స్‌లో ఉంచడం కంటే, అసలు కథా ప్రపంచం ఏంటో వాళ్లకు ముందే క్లారిటీ ఇచ్చి థియేటర్‌కు వచ్చేలా ప్రిపేర్ చేయడమే నీల్ మాస్టర్ ప్లాన్. 1947 నాటి ఓపియం మాఫియా, దాదా సర్కార్, జనరల్ డురాన్ లాంటి ఇంటర్నేషనల్ విలన్స్, 91 డెత్స్ అనే క్రూరమైన గ్యాంగ్.. ఇవన్నీ ముందే చూపించడం వల్ల రేపు థియేటర్లో ఆడియన్స్ నేరుగా లుగర్ విధ్వంసంలోకి వెళ్ళిపోవచ్చు.

కథను ముందే అర్థం చేసుకునేలా చేయడం వల్ల సినిమా చూసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా నేరుగా ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ నాలుగు నిమిషాల ఇరవై తొమ్మిది సెకన్ల కట్ థియేటర్లలో ఫ్యాన్స్‌కు ఒక చిన్న సినిమా చూసిన అనుభూతిని ఇస్తోంది. కొంత మేరకు అసంతృప్తి ఉన్నా కూడా రవి బస్రూర్ హెవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భువన్ గౌడ విజువల్స్ బిగ్ స్క్రీన్ మీద ఒక రేంజ్ కిక్ ఇస్తున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో విడుదల కానున్న భారీ క్రేజ్ ఉన్న పెద్ద సినిమాల షోల కంటే ముందే థియేటర్లలో ఈ గ్లింప్స్‌ను కూడా ప్రదర్శించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.

అదే గనుక జరిగితే సినిమా రిలీజ్‌కు ముందే ఈ డ్రాగన్ ప్రపంచం సామాన్య ప్రేక్షకులకు కూడా చాలా బలంగా రీచ్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్, లుక్ ఈ డార్క్ మాఫియా థీమ్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. సన్నబడిన బాడీతో, బ్లాక్ వెస్ట్‌లో తారక్ ఇచ్చిన ఎంట్రీ ఆడియన్స్‌కు సరికొత్త పూనకాలు తెప్పించింది. తారక్ చెప్పిన డైలాగ్స్ లుగర్ సైకాలజీ ఎంత క్రూరంగా ఉండబోతోందో ముందే రిజిస్టర్ చేసేశాయి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఈ కథలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉందని ఈ మాటలు హింట్ ఇస్తున్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న థియేటర్లలోకి రాబోతోంది. ప్రమోషన్స్ మొదటి అడుగులోనే అసలు కథను రివీల్ చేస్తూ ప్రశాంత్ నీల్ రాసిన ఈ సరికొత్త రూల్ బుక్, భవష్యత్తులో రాబోయే మిగతా పాన్ ఇండియా సినిమాల ఆలోచనా విధానాన్ని కచ్చితంగా మార్చేలా ఉంది. కథను దాచకుండా నేరుగా పాయింట్ చెప్పి కొట్టడం అనేది ఈ చిత్రానికి అతిపెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది.

This post was last modified on May 20, 2026 10:47 am

Share

Recent Posts

బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారా?

బాలినేని శ్రీనివాసరెడ్డి... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువు. జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డికి మరింత…

5 hours ago

స్టార్ల మల్టీప్లెక్సులు… ఆదాయానికి కొత్త దారులు

వైజాగ్ లో అల్లు ఫ్యామిలీ, ఏషియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన 8 స్క్రీన్ల ఏఏఏ మల్టీప్లెక్స్ అఫీషియల్ గా లాంచయ్యింది.…

5 hours ago

డాక్టర్ కావాలనే ప్రియాంక కల… కలగానే మిగిలిపోయింది..!

ఏపీలోని రాజమహేంద్రవరం నగరంలో ఇటీవల చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ కేసు ఆదివారం కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో…

7 hours ago

వీరభద్రుడి ఒత్తిడి విశ్వనాథ్ మీద ఉంటుందా

వచ్చే వారం విడుదలవుతున్న సినిమాల్లో విశ్వనాథ్ అండ్ సన్సే పెద్దది. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ తీసింది సితార ఎంటర్ టైన్మెంట్స్…

9 hours ago

హీరోయిన్‌కు అభిమాని లిప్ కిస్

పబ్లిక్‌లోకి వచ్చే సెలబ్రెటీలతో సామాన్య జనం కొన్ని సందర్భాల్లో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు. తమ అభిమాన కథానాయకులు, కథానాయికలను చూసిపుడు…

12 hours ago

తమిళనాట పోక్సో కేసు… క్రెడిట్ రావిపూడిదే

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. సినిమాల ప్రభావం సమాజం మీద చాలానే ఉంటుందన్నది వాస్తవం. అత్యంత ఆకర్షణీయమైన మీడియం కాబట్టి..…

15 hours ago