Movie News

ఆర్ఆర్ఆర్ హీరోలు… కాకతాళీయ పోలికలు

టాలీవుడ్ మల్టీస్టారర్స్ లో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టిన హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎప్పటికీ స్పెషల్ గా నిలిచిపోతారు. వీళ్ళను స్ఫూర్తిగా తీసుకుని వెంటనే ఎవరూ చేతులు కలపలేదు కానీ అలాంటి కాంబోలు సెట్ చేయడానికి అందరూ రాజమౌళిలు కాలేరుగా. సరే ఇది కాసేపు పక్కనపెడితే ఒక విషయంలో ఇద్దరూ కాకతాళీయంగా ఒకే పోలికను చూపిస్తున్నారు. అదేంటో చూద్దాం. పెద్దికు ముందు వచ్చిన రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే.

డ్రాగన్ కు ముందు జూనియర్ ఎన్టీఆర్ మూవీ వార్ 2. ఇది తెచ్చిన నష్టాల గురించి బాలీవుడ్ సైట్స్ తరచూ ప్రస్తావిస్తూ ఉంటాయి. ఈ రెండు సినిమాల దర్శకులు పరభాషా బ్యాచ్. శంకర్ తమిళం అయితే అయాన్ ముఖర్జీ హిందీ. అంత సులభంగా మర్చిపోలేని ఫ్లాప్స్ ఇచ్చారు. రాజమౌళి నెగటివ్ సెంటిమెంట్ ని తారక్ దేవరతో బ్రేక్ చేశాడు కానీ చరణ్ మాత్రం తప్పించుకోలేకపోయాడు. రాబోయే పెద్ది, డ్రాగన్ లో సింగల్ హీరోయిన్లు ఉన్నారు. జాన్వీ కపూర్ హిందీ కాగా, రుక్మిణి వసంత్ కన్నడ.

ఇలా ఎన్నో కంపారిజన్లు చాలా దగ్గరగా ఉండటం గమనించాల్సిన విషయం. అయితే పెద్ది జూన్ 4 విడుదల కానుండగా సరిగ్గా సంవత్సరం తర్వాత అదే జూన్ నెలలో డ్రాగన్ థియేటర్లకు వస్తుంది. అప్పటికంతా చరణ్ సుకుమార్ కాంబో మూవీ ఒక కొలిక్కి వచ్చి ఉండొచ్చు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తారక్ చేయబోయే మూవీ స్టార్ట్ అవ్వొచ్చు. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సిన విషయం మరొకటుంది. ఈ ఇద్దరూ ఒకేసారి టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ తో ఒకేసారి పని చేయబోవడం.

ఈ పోలికల ముచ్చట కాసేపు పక్కనపెడితే పెద్ది, డ్రాగన్ గ్రాండ్ సక్సెస్ కావడం చరణ్, తారక్ ఇద్దరికీ చాలా కీలకం. మార్కెట్ విస్తృతి పెరగాలన్నా, గ్లోబల్ గా మరింత రీచ్ రావాలన్నా ఇవి బ్లాక్ బస్టర్ కన్నా తక్కువ ఫలితం అందుకోకూడదు. దానికి తగ్గట్టే ఒక్కొక్కరు రెండేళ్లకు పైగా విలువైన సమయం, ఒళ్ళు హూనం అయ్యేలా మేకోవర్ లాంటివన్నీ చేసుకుంటున్నారు. వన్ ఇయర్ గ్యాప్ లో ఇద్దరూ ఎలాంటి రిజల్ట్స్ అందుకుంటారో చూడాలి.

This post was last modified on May 18, 2026 10:42 pm

Share

Recent Posts

టాలీవుడ్ స్టార్లు ఆ మాయలో పడి నష్టపోతున్నారా

మన టాలీవుడ్ స్టార్లు ఇప్పుడు లోకల్ మార్కెట్ ను దాటేసి అంతకుమించి అనేలా అడుగులు వేస్తున్నారు. నార్త్ ఆడియన్స్ తో…

52 minutes ago

అబ్బవరం ఈసారి బయటపడగలడా?

యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి ఒక టైంలో వచ్చిన సినిమాలు చూస్తే.. తన పనైపోయిందనే అనిపించింది. ఐతే కెరీర్…

2 hours ago

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

7 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

8 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

11 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

11 hours ago