Movie News

బ్లాక్‌బస్టర్ కాంబో.. మళ్లీ కొడతారా?

తమిళనాట విజయ్ సినీ రంగానికి దూరం కావడంతో ఇండస్ట్రీలో ఒక శూన్యత ఆవహించిన పరిస్థితి. రజినీకాంత్, కమల్ హాసన్‌లకు వయసు మీద పడడం.. అజిత్ ఇంతకుముందులా ఉత్సాహంగా సినిమాలు చేయకపోవడంతో టాప్ లీగ్‌లోకి వెళ్లడానికి తర్వాతి రేంజ్ హీరోలకు ఇప్పుడో మంచి అవకాశం దక్కింది. గత కొన్నేళ్లలో చాలా వేగంగా మార్కెట్‌ను పెంచుకున్న హీరోల్లో శివకార్తికేయన్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

ముఖ్యంగా ‘అమరన్’ సినిమా తన రేంజిని అమాంతం పెంచింది. ఆ చిత్రం ఏకంగా రూ.300 కోట్ల వసూళ్లు సాధించింది. దాని తర్వాత శివ నుంచి వచ్చిన ‘పరాశక్తి’ సరిగా ఆడకపోయినా.. అతడి మార్కెట్‌ ఏమీ పడిపోలేదు. ఇప్పుడు శివ చేయబోతున్న ‘సెయాన్’ సినిమాతో ‘అమరన్’ స్థాయి హిట్ కొడితే.. అతను ఇంకా పెద్ద రేంజికి వెళ్లడం ఖాయం. ‘అమరన్’ సినిమాను నిర్మించిన కమల్ హాసనే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుండడం విశేషం.

విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన ‘సెయాన్’ ఈ రోజే సెట్స్ మీదికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా కాంబినేషన్లన్నీ చాలా క్రేజీగా అనిపిస్తున్నాయి. శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన ‘తాయ్ కిళవి’ అనే సూపర్ హిట్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శివకుమార్ మురుగేశన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం.

‘తాయ్ కిళవి’తో శివకుమార్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇలాంటి అభిరుచి ఉన్న దర్శకుడు శివకార్తికేయన్ లాంటి టాలెంటెడ్ హీరోతో సినిమా చేస్తుండడం.. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ ప్రొడ్యూస్ చేస్తుండడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండడం విశేషం.

తన తొలి నాలుగు చిత్రాలు ఫ్లాపైనా తనకు అవకాశాలేమీ ఆగట్లేదు. తమిళంలోనూ ఆమె ‘కాంత’తో ఫ్లాప్‌ను ఖాతాలో వేసుకుంది. కానీ అందులో భాగ్యశ్రీ కెరీర్లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆమె జస్ట్ అందగత్తె కాదని, మంచి పెర్ఫామర్ అని ఈ సినిమాతో రుజువైంది. ఆ టాలెంట్ చూసే శివకార్తికేయన్ సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

This post was last modified on May 18, 2026 7:53 pm

Share

Recent Posts

అసలు ఈ మస్క్ వివాదం ఏంటి?

గ‌త రెండు రోజులుగా ఇటు సోష‌ల్ మీడియాలోను, అటు ప్ర‌ధాన మీడియా ఛానెళ్ల‌లోను.. తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన విష‌యం.. ప్ర‌పంచ…

4 hours ago

బడ్జెట్ రూ. 2 కోట్లు కలెక్షన్లు 50 కోట్లు…

పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…

5 hours ago

కమల్ కోసం రజినీ త్యాగం?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…

8 hours ago

‘కామ్రేడ్ కళ్యాణ్’ను కాపాడిన మెగాస్టార్

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…

9 hours ago

కోన వెంకట్ భాషలో ‘క్రిమినల్స్’ ఎవరు

నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…

11 hours ago

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…

12 hours ago