గత కొన్నేళ్లలో సినిమాల పరంగా భాషల మధ్య హద్దులు చెరిగిపోయాయి. ప్రాంతీయ భాషా చిత్రాలు వివిధ భాషల్లో రిలీజవుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ ఇండస్ట్రీలకు చెందిన ఫిలిం సెలబ్రెటీల మధ్య కూడా మంచి సంబంధాలు ఏర్పడుతున్నాయి. ప్రమోషన్ పరంగా ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో కూడా మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఒకరి చిత్రాన్ని ఒకరు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిలిం సెలబ్రెటీల మధ్య సరదా సంభాషణలు కూడా నడుస్తుంటాయి సోషల్ మీడియాలో. తాజాగా సూర్య నటించిన కరుప్పు సినిమా విడుదల విషయంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఒక రోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చింది.
టాక్ అంత గొప్పగా లేకపోయినా ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి మంచి ఫలితమే రాబడుతోంది. ముఖ్యంగా కరుప్పు తమిళంలో భారీ వసూళ్లు రాబడుతోంది. తెలుగులో కలెక్షన్లు పర్వాలేదు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కరుప్పు గురించి ట్వీట్ వేశాడు. ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సూర్య అండ్ టీంకు విజయ్ శుభాకాంక్షలు చెప్పాడు. ఈ ట్వీట్‌కు సూర్య, త్రిషతో పాటు మరి కొందరు కరుప్పు టీం సభ్యులు స్పందించారు. విజయ్‌కి థ్యాంక్స్ చెప్పారు.
ఐతే సూర్య రిప్లై కొంచెం స్పెషల్‌గానే ఇచ్చాడు. ఇదంతా మా ప్రియమైన అభిమానుల కోసం అంటూ సినిమాలోని డైలాగ్‌ను గుర్తు చేస్తూ పోస్టు పెట్టాడు సూర్య. అంతటితో ఆగకుండా మంచి హాలిడే స్పాట్ చెప్పు అంటూ విజయ్‌ని అడిగాడు సూర్య. విజయ్, రష్మిక తరచుగా హాలిడేలకు వెళ్తుంటారన్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే ఇది నడుస్తోంది.
పెళ్లి తర్వాత కూడా రెండు టూర్లకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సూర్య సరదాగానే విజయ్‌ని హాలిడే స్పాట్ గురించి అడిగాడు. దీనికి విజయ్ బదులిస్తూ.. మన ప్రధాని ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ పర్యటనలు వద్దని అంటున్నాడని.. కాబట్టి దేశీయంగా మంచి హాలిడే స్పాట్ల వివరాలను వాట్సాప్ ద్వారా పంపించానంటూ విజయ్ బదులిచ్చాడు. ఈ సంభాషణ ఇరువురి అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.
This post was last modified on May 17, 2026 10:56 pm
ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…