థియేట్రికల్ రిలీజ్‌కు, డిజిటల్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ తగ్గిపోవడమే.. సినిమాల వసూళ్లు పడిపోవడానికి ప్రధాన కారణం అంటూ ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. నిర్మాతలు సైతం ఇదే మాట చెబుతుంటారు. కానీ అలా మాట్లాడే నిర్మాతలే.. తమ సినిమాలను తక్కువ గ్యాప్‌లో ఓటీటీలోకి తీసుకొచ్చేస్తుంటారు.
థియేటర్లలో రిలీజైన తక్కువ రోజులకే ఓటీటీలోకి సినిమా వస్తుండడంతో థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాల్సిన అవసరమేంటి, అయినా థియేటర్లకు వెళ్లి చూసేంత కంటెంట్ ఎన్ని సినిమాల్లో ఉంటోంది అన్నది ప్రేక్షకుల వాదన. అదే సమయంలో జనం థియేటర్లకు రావట్లేదు కదా, అలాంటపుడు తక్కువ టైంలో డిజిటల్ రిలీజ్‌కు ఓకే చెబితే ఎక్కువ రేటు ఇచ్చే ఓటీటీలతో డీల్స్ చేసుకుంటే తప్పేంటి అన్నది నిర్మాతల అభిప్రాయం. ఇందులో ఎవరి వాదన కరెక్ట్ అన్నది చెప్పలేం.
కానీ థియేట్రికల్, డిజిటల్ రిలీజ్‌కు మధ్య గ్యాప్ అంతకంతకూ తగ్గిపోతోందన్న మాట మాత్రం వాస్తవం.
కొన్ని నెలల ముందు పాంచ్ మినార్ అనే సినిమాను థియేటర్లలో రిలీజైన వారం రోజులకే ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇంకో సినిమాను కేవలం 12 రోజుల గ్యాప్‌లో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ఆ చిత్రమే.. సతీ లీలావతి.
విడుదల కోసం చాలా రోజుల పాటు ఎదురు చూసిన ఈ సినిమాను మే 8న థియేటర్లలో రిలీజ్ చేసింది చిత్ర బృందం. కానీ ఈ సినిమాకు బ్యాడ్ టాక్ రావడం, ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోవడంతో థియేటర్లలో దారుణమైన ఫలితం వచ్చింది. పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి. థియేటర్లలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన లావణ్య త్రిపాఠి చిత్రాన్ని ఈ నెల 20న డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం చేశారు. సన్ నెక్ట్స్ ఈ సినిమాను రిలీజ్ చేయబోతోంది.
మరోవైపు ఈ నెల 1న వచ్చిన జెట్లీ సినిమాను కూడా అనుకున్న దాని కంటే కొంచెం తొందరగానే ఓటీటీలోకి తెస్తున్నారు. థియేటర్లలో రిలీజైన 24వ రోజుకే ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతున్నారు. జియో హాట్ స్టార్ ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనుంది.
This post was last modified on May 17, 2026 10:36 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…