Movie News

విశ్వనాథ్ ఇంటికి అనుకోని అదృష్టం

ఏ స్టార్ హీరోకైనా ఒక హిట్ లేదా ఫ్లాప్ తాలూకు ప్రభావం దాని తర్వాత సినిమా మీద ఖచ్చితంగా ఉంటుంది. దీనికెవరూ మినహాయింపు కాదు. వాళ్ళ ఇమేజ్ తగ్గడమో దెబ్బ తినడమో జరగదు కానీ మార్కెట్ లెక్కల్లో మాత్రం తేడాలు వస్తాయి.ఇది సూర్యకు బాగా అనుభవం, కంగువ, రెట్రో వరసగా డిజాస్టర్ కావడం వీరభద్రుడు మీద ఎఫెక్ట్ చూపించింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా మంచి వసూళ్లు నమోదు చేయడం బాక్సాఫీస్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.

తెలుగు వరకు ఇప్పుడిప్పుడే చెప్పలేం కానీ తమిళంలో అయితే పెద్ద హిట్టు కొట్టేలా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే సూర్య తర్వాతి సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు రెడీ అవుతోంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ రామ్ కామ్ మూవీలో మమిత బైజు హీరోయిన్. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చగా సితార బ్యానర్ మీద నిర్మాత నాగవంశీ పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించారు. ఆ మధ్య వచ్చిన టీజర్ బాగానే ఆకట్టుకుంది.

ఇప్పుడు కరుప్పు ఫలితం పుణ్యమాని విశ్వనాధ్ అండ్ సన్స్ కి డిమాండ్ పెరుగుతుంది. కంటెంట్ మాస్ ప్రేక్షకుల కోసం తీసింది కాకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయడం వల్ల అన్ని వర్గాలకు చేరువ కావొచ్చనే నమ్మకం మేకర్స్ లో ఉంది. ధనుష్ సార్ తరహాలో ఇది కూడా సర్ప్రైజ్ హిట్ అవుతుందనే ధీమా అభిమానుల్లో ఉంది. ఇరవై ఏళ్లకు పైగా వయసు గ్యాప్ ఉన్న హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథే ఈ విశ్వనాథ్ అండ్ సన్స్.

ముందు జూలై రిలీజ్ అనుకున్నారు కానీ సాధ్యం కాకపోవచ్చని ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ లో స్వతంత్ర దినోత్సం ఆప్షన్ చూస్తున్నారు కానీ ఒకవేళ అదే టైంలో జైలర్ 2, విశ్వంభర వస్తే ఏం చేయాలనే దాని గురించి కూడా కసరత్తు జరుగుతోంది. పైగా ఆగస్ట్ 21 నాని ప్యారడైజ్ ఉంది. ఇవన్నీ చూసుకుంటే విశ్వనాథ్ సరైన స్లాట్ దక్కించుకోవడం కొంచెం ఛాలెంజ్ గానే అనిపిస్తోంది. రెండు మూడు రోజులు ప్యాచ్ వర్క్ తప్ప గుమ్మడికాయ ఆల్రెడీ కొట్టేశారని చెన్నై వర్గాల కథనం.

This post was last modified on May 17, 2026 3:26 pm

Share

Recent Posts

పెళ్లి కోసం తపించిపోయేవాళ్ళు ఇంతమంది ఉన్నారా?

నాకు పెళ్ళెప్పుడవుతుంది బాబూ ... పిల్ల యాడ దొరుకుతుంది బాబోయ్ అనే సినిమా పాట పాడుకుంటున్నారు కేరళం యువకులు. అత్యధిక…

24 minutes ago

రష్మిక తాండవం ఊహించలేదు

ర‌ష్మిక మంద‌న్నా కెరీర్లో ఎక్కువ‌గా స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గానే న‌టించింది. ఈ మ‌ధ్యే ఆమె కూడా లేడీ ఓరియెంటెడ్…

45 minutes ago

హైదరాబాద్ గడ్డపై విరుచుకుపడ్డ అమిత్ షా

తెలంగాణ‌లో ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు అమిత్‌షా.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కీల‌క…

51 minutes ago

ఏపీలో మునిసిప‌ల్ పోలింగ్ ఎందుకు త‌గ్గింది… రీజ‌నేంటి?

ఏ ఇద్ద‌రు నేత‌లు క‌లిసినా.. ఏ ఇద్ద‌రు నాయ‌కులు ఫోన్లు చేసుకున్నా.. ఇదే అంశంపై చ‌ర్చ సాగుతోంది. ఏపీలో తాజాగా…

59 minutes ago

అమ్మా… నాన్న…. ఓ బుడ్డోడు

సంతానం లేని ఆ దంపతులు తల్లి చనిపోయిన పసి బిడ్డను దత్తత తీసుకొని గుండెలకు హత్తుకున్నారు. ఆలానా పాలనా చూస్తూ…

1 hour ago

రెండు నెల‌ల వ‌రకు టీటీడీ బోర్డు లేన‌ట్టే..

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత తిరుమల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క మండ‌లి కాల ప‌రిమితి తీరిపోయిన నేప‌థ్యంలో కొత్త‌గా పాల‌క మండ‌లిని ఏర్పాటు…

2 hours ago