Movie News

డిజిటల్ దురంధర్… ఇది నిజంగా బ్లండర్

బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించిన దురంధర్ ది రివెంజ్ ఇటీవలే ఇండియా మినహాయించి మిగిలిన ప్రపంచంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదలయ్యింది. మన దేశంలో హాట్ స్టార్ లో జూన్ 4 నుంచి అందుబాటులో రానుంది. అదే ప్లాట్ ఫార్మ్ లో ఐపీఎల్ వస్తున్న నేపథ్యంలో అది ముగిశాక స్ట్రీమింగ్ చేస్తే వ్యూస్ విడిపోవనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని ముంబై వర్గాల కథనం. అయితే ఇదే రివర్స్ లో బూమరాంగ్ అవుతోందని చెప్పక తప్పదు.

ఎందుకంటే దురంధర్ ది రివెంజ్ కు ఇతర దేశాల్లో భీభత్సమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్ రిలీజ్ నిషేధించిన పాకిస్థాన్ లో ఓటిటిలో వచ్చిన మొదటి రోజు సర్వర్లు క్రాష్ అయ్యే రేంజ్ లో ఒక్కసారిగా జనం నెట్ ఫ్లిక్స్ మీద పడ్డారని ఒక వ్లాగర్ చేసిన వీడియో బాగా వైరల్ అవుతోంది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు బయట పైరసీ రూపంలో ఒక కాపీని 50 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. దురంధర్ మొదటి భాగానికి కూడా ఇలాగే చేశారు.

ఇక మనోళ్ల విషయానికి వస్తే జూన్ 4 దాకా ఆగలేకపోతున్న కొందరు పైరసీ మార్గాల ద్వారా హెచ్డి ప్రింట్ చూసేస్తున్నారు. దీన్ని కట్టడి చేసే వ్యవస్థ ఇక్కడ బలహీనంగా ఉండటంతో అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అదేదో హాట్ స్టార్ ఈ టైంలోనే విడుదల చేసి ఉంటే మిలియన్ల వ్యూస్ వెల్లువల్గా వచ్చి పడేవి. అయినా ఐపీఎల్ మ్యాచులు అత్యధిక శాతం సాయంత్రం పూటే జరుగుతున్నాయి. మిగిలిన టైంలో ఆడియన్స్ కి మరో ఛాయస్ కావాలి కదా.

ఏది ఏమైనా దురంధర్ ది రివెంజ్ యాభై రోజులకు కూడా టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా నిలవడం విశేషం. రెండు వేల కోట్ల మార్కుని అందుకోలేకపోయినా ఇప్పుడు సాధించిన విజయం చిన్నది కాదు. బాలీవుడ్ స్పై సినిమాలను చూపించే విధానాన్ని సమూలంగా మార్చేసిన దురంధర్ నుంచి మూడో భాగం వచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. దర్శకుడు ఆదిత్య దార్ కొనసాగింపు మీద ఆసక్తిగా లేనప్పటికీ నిర్మాతలు మాత్రం ఛాన్స్ ఉంటే చూడమని అడుగుతున్నారట.

This post was last modified on May 17, 2026 1:17 pm

Share

Recent Posts

“మీరు ఢిల్లీకి ఎందుకు రాలేదు?”.. రేవంత్ సీరియస్

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల వ్య‌వ‌హారం కీల‌క చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. జాతీయ‌స్థాయిలో 'ఓట్…

6 minutes ago

భామలు చల్లే బురదకు బాధ్యులు ఎవరు

ఇటీవలే విడుదలైన నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'అక్క' ప్రమోషన్లలో భాగంగా రాధికా ఆప్టే గతంలో తాను పని చేసిన…

2 hours ago

అదుపు తప్పుతున్న ‘ఆదర్శ’ కలం

మాటల మాంత్రికుడు, గురూజీ, సరస్వతి రూపం ఇలా ఎన్ని బిరుదులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అలంకారంగా ఉంటూ వచ్చాయో ప్రత్యేకంగా…

3 hours ago

ట్రైన్‌లో సీట్లనే ఎత్తుకెళ్లిపోయారు

రైళ్లలో ప్రయాణికుల సౌకర్యాల కోసం ఏర్పాటు చేసిన వస్తువులకే రక్షణ లేకపోతే ఎలా? ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పే…

5 hours ago

తమిళనాడుకు ప్రత్యేక జెండా కావాలా?

భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత రాష్ట్రాలు వున్నాయి. ఇందులో ఏ రాష్ట్రానికి లేని విధంగా తమిళనాడుకు…

6 hours ago

48 ఏళ్లుగా నీళ్లు కాకుండా కోకాకోలా తాగి బతుకుంటున్నారా?

ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన వారెన్ బఫెట్ పేరు వినగానే ఆయన పెట్టుబడులు, వ్యాపార నిర్ణయాలే గుర్తుకొస్తాయి. ఎన్నో…

6 hours ago