Movie News

గట్టుమీద వదిలేసి తొందరపడ్డారేమో

నిన్న వారం విడుదలైన గోదారి గట్టుపైనకు మిక్స్డ్ టాక్ వచ్చిన మాట వాస్తవం. తండ్రి కూతురి ఎమోషన్ ని తీసుకుని ఒక ఆటో డ్రైవర్ ప్రేమకథకు ముడి పెడదామని చూసిన దర్శకుడు అందులో పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు. ఫలితంగా వీక్ డేస్ మొదలయ్యాక విపరీతమైన డ్రాప్ కనిపించేసింది. దీంతో రిలీజ్ ముందు వరకు తెగ హడావిడి చేసిన టీమ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రెస్ మీట్లు, లేకుండా మౌనం వహించింది. హీరో హీరోయిన్ కొన్ని టూర్లు వేస్తున్నారు కానీ అవి జనాల్లోకి వెళ్ళడం లేదు.

అసలు సంగతేమిటంటే గోదారి గట్టుపైన రెండో వారంలో చాలా చోట్ల కొనసాగుతోంది. వేరే సినిమాలు లేకపోవడం, డబ్బింగులు ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడం వల్ల ఎగ్జిబిటర్లు కంటిన్యూ చేస్తున్నారు. వీరభద్రుడు టాక్ యావరేజ్ లేదా ఫ్లాప్ అయ్యే స్థాయిలో ఉన్నా ఆక్యుపెన్సీలు బాగున్నాయి. ముఖ్యంగా ఏ సెంటర్స్ అధిక శాతం హౌస్ ఫుల్స్ నమోదు చేశాయి. ఈ ఫ్లోలో గోదారి గట్టుపైన చూసే ఆడియన్స్ కూడా ఉండటం గమనించాల్సిన విషయం.

ఒకరకంగా చెప్పాలంటే పూర్తిగా గట్టుపైన వదిలేసి యూనిట్ మౌనవ్రతం పాటించడం కొంచెం రాంగనే చెప్పాలి. అలాని ఏదో భీభత్సంగా వసూళ్లు వస్తున్నాయని కాదు కానీ ఉన్నంతలో ఏదో నెట్టుకొస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యావరేజ్ కంటెంట్ ఉన్నా చాలు జనంలోకి బలంగా తోస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి. కానీ పబ్లిసిటీ ఖర్చు భరించలేక చాలా మంది నిర్మాతలు మొదటి వీకెండ్ అవ్వగానే ఉన్నట్టుండి సౌండ్ చేయడం మానేస్తున్నారు.

మేం ఫేమస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరో సుమంత్ ప్రభాస్ కు రెండో సినిమా మాత్రం చిన్నపాటి షాక్ ఇచ్చిందని చెప్పాలి. తనకు సూటయ్యే పాత్రే ఎంచుకున్నా అది అన్ని వర్గాలను చేరేలా ఉందో లేదో చూసుకోకపోవడం గోదారి గట్టుపైనకు మైనస్ అయ్యింది. నువ్వే నువ్వే, ఆకాశమంత కథలను అటుఇటు తిప్పి ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీగా మార్చడం బాగానే ఉంది కానీ దానికి సరిపడా ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ బలంగా జోడించి ఉంటే ఖచ్చితంగా హిట్టయ్యేది.

This post was last modified on May 17, 2026 11:19 am

Share

Recent Posts

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

46 minutes ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

53 minutes ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

1 hour ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

2 hours ago

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

5 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

6 hours ago