ఇంకో రెండు రోజుల్లో రాబోతున్న పెద్ది ట్రైలర్ కోసం మెగా ఫ్యాన్స్ ఎదురు చూపులు మాములుగా లేవు. మూడు నిమిషాల రెండు సెకండ్ల నిడివితో పెద్ద వెర్షన్ కట్ చేయించిన దర్శకుడు బుచ్చిబాబు ఇలా ఎందుకు చేశారనే దానికి సహేతుకమైన కారణం ఉందని తెలిసింది. ఇంటర్వ్యూలలో చెప్పిన దాంతో పాటు ఇన్ సైడ్ టాక్ ప్రకారం పెద్దిలో మొదటి అరగంట మినహాయించి మిగిలిన రెండున్నర గంటలు క్రమం తప్పకుండా బరువైన ఎమోషన్స్ జర్నీ చేస్తూ ఉంటాయట.
క్లైమాక్స్ లో ఏదైతే బుచ్చిబాబు ఊహించని ట్విస్టు ఇస్తున్నాడో దానికి తగ్గట్టు ఆడియన్స్ ని ముందే ప్రిపేర్ చేయడం చాలా అవసరం. లేదంటే పుష్ప లాగా ఉంటుందనో, కెజిఎఫ్ లాగా ఎలివేషన్లతో నిండిపోతుందనో మాస్ జనాలు కనక ఊహించుకుంటే కష్టమవుతుంది. వాళ్ళు కోరుకున్న ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కేవలం వాటి మీదే ఆధారపడకుండా భావోద్వేగాలను వాళ్ళు రిసీవ్ చేసుకోవాలంటే పెద్ది క్యారెక్టర్ ని సరైన రీతిలో పరిచయం చేయాలి.
అందుకే ట్రైలర్ లెన్త్ విషయంలో రాజీ పడలేదని తెలిసింది. దీన్ని టాక్ అఫ్ ది ఇండస్ట్రీ చేయాలనే సంకల్పంతోనే బుచ్చిబాబు చాలా శ్రద్ధ తీసుకున్నారట. అన్ని పాత్రలను పరిచయం చేయడంతో పాటు క్రీడల గురించి మరింత క్లారిటీ ఇవ్వబోతున్నారు. ట్రైలర్ అంత ఒక ఎత్తయితే చివర్లో వచ్చే షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది. ఈసారి ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మరింత స్పెషల్ గా నిలవనునుంది. బీజీఎమ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.
బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఒక్కొక్క ఏరియా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు. నైజామ్ సింగల్ స్క్రీన్ల గొడవకు కమిటీ రూపంలో బ్రేక్ పడటంతో నిర్మాత హమ్మయ్య అనుకుంటున్నారు. ముంబైలో ట్రైలర్ లాంచ్ తో మొదలుపెట్టి వరసగా పవర్ ప్లే పేరుతో చేయబోతున్న ఈవెంట్లతో హైప్ మరింత పెరగనుంది. శివరాజ్ కుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూలు వచ్చే వారం జరిగే అవకాశాలున్నాయి. వీటి కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ వస్తారని టాక్.
Gulte Telugu Telugu Political and Movie News Updates
