Movie News

సస్పెన్సుకు తెరదించబోతున్న రామ్

టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల్లో ఒకడైన రామ్.. ఒకప్పుడు నిలకడగా విజయాలు అందుకునేవాడు. కానీ కొన్నేళ్లుగా అతడికి అస్సలు కలిసి రావడం లేదు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వరుసగా పరాజయాలు అందుకున్నాడు. గత ఏడాది వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా విషయంలో రామ్ ఎంత తపన పడ్డాడో తెలిసిందే. తన మాస్ ఇమేజ్ అంతా పక్కన పెట్టి ఒక స్టార్ హీరోను ఆరాధించే వీరాభిమాని పాత్రలో ఒదిగిపోయాడు.

ఈ సినిమా కోసం అతను సొంతంగా ఒక పాట కూడా రాశాడు. కొంత వరకు రైటింగ్‌లో కూడా ఇన్వాల్వ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఐతే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పాజిటివ్ రివ్యూలు, టాక్ తెచ్చుకుని కూడా సరిగా ఆడలేదు. తన ఖాతాలో మరో ఫ్లాప్ జమ కావడంతో రామ్ బాగా డిజప్పాయింట్ అయ్యాడు. అందుకే కొత్త సినిమా విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలని నిర్ణయించుకున్నాడు.

వేరే వాళ్లు రాసిన కథలు తనకు మంచి ఫలితాన్ని ఇవ్వలేకపోతున్న నేపథ్యంలో రామ్ ఈసారి తనే సొంతంగా కథ రాసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్ని డీల్ చేసే డైరెక్టర్ కోసం వెతుకుతున్నాడని.. డైరెక్షన్ కూడా తనే చేయాలనుకుంటున్నాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి.ఐతే రామ్ కొత్త సినిమా విషయంలో ఇప్పటిదాకా క్లారిటీ రాలేదు. ఎట్టకేలకు రామ్ సస్పెన్సుకు తెరదించాలని నిర్ణయించుకున్నాడు.

శుక్రవారమే రామ్ కొత్త సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోంది. దానికి ముందు ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో రామ్ టీజ్ చేశాడు. అందులో ఒక వ్యక్తి చేతిలో మైక్ ఉంది. అది రక్తంతో తడిసి ఉంది. ఈ పోస్టర్ మీద దర్శక నిర్మాతల వివరాలేమీ లేవు. నేరుగా శుక్రవారం ఉదయమే అన్ని వివరాలు, విశేషాలు పంచుకోబోతున్నాడు. పోస్టర్ చూస్తే ఇది వయొలెంట్ సినిమా అనే సంకేతాలు కలుగుతున్నాయి.

కానీ కత్తితో పాటు రక్తం ఉంటే పక్కా వయొలెంట్ మూవీ అనుకోవచ్చు. కానీ హీరో చేతిలో ఉన్నది కావడంతో కాన్సెప్ట్ విషయంలో ట్విస్ట్ ఉంటుందేమో చూడాలి. ఐతే ఎలాంటి కథ ఎంచుకున్నప్పటికీ.. ఈసారి రామ్ హిట్టు కొట్టి తీరాల్సిందే. లేదంటే ఇప్పటికే బాగా డౌన్ అయిన మార్కెట్ మరింత కిందికి వెళ్లిపోవడం ఖాయం.

This post was last modified on May 14, 2026 7:48 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

1 hour ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

3 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

4 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

4 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

4 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

5 hours ago