Movie News

ఇరుముడిలో బంగారు పల్లకి పాట ఖాయమేనా?

కెరీర్లో ఎక్కువ శాతం మాస్ మ‌సాలా సినిమాలే చేస్తూ వ‌చ్చిన ర‌వితేజ‌.. ఈ మ‌ధ్య రూటు మార్చేశాడు. ఈ సంక్రాంతికి మాస్ అంశాలేమీ లేకుండా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి లాంటి ప‌క్కా ఫ్యామిలీ మూవీతో ప‌ల‌క‌రించిన ర‌వితేజ‌… ఇప్పుడు నిన్ను కోరి, మ‌జిలీ, ఖుషి లాంటి క్లాస్ ల‌వ్ స్టోరీలు తీసిన శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో ఇరుముడి అనే వైవిధ్య‌మైన సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్ చూసి అంద‌రూ షాకైపోయారు.

ర‌వితేజ నుంచి ఇలాంటి సినిమాను ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇందులో ఆయ‌న అయ్య‌ప్ప స్వామి మాల వేసుకునే మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. తెలుగులో ఒక స్టార్ హీరో ఇలాంటి పాత్ర‌ను చేసింది లేదు. అయ్య‌ప్ప స్వామి భ‌క్తుడిగా హీరో పాత్ర‌, మాల‌ధార‌ణ నేప‌థ్యంలో సినిమా అన‌గానే ఇందులో పాట‌ల విష‌యంలో ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డింది.

మాల ధ‌రించిన స్వాములు పాడుకునే ఫేమ‌స్ అయ్య‌ప్ప పాట‌లు ఇందులో ఉండొచ్చ‌ని భావిస్తున్నారు. ముఖ్యంగా ఆ పాట‌ల్లో బాగా ఫేమ‌స్ అయిన విల్లాది వీరుడు.. వీర‌మ‌ణి కంఠుడు సాంగ్ మీద ఆల్రెడీ ఒక బ‌జ్ న‌డుస్తోంది. ఇంత‌కుముందు త‌న సినిమా రిలీజ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుడు జి.వి.ప్ర‌కాష్ మూవీలో ఈ పాట ఉండొచ్చ‌నే సంకేతాలు ఇచ్చాడు.

ఇప్పుడు ఆ విష‌యాన్ని ధ్రువీక‌రిస్తూ ట్వీట్ వేశాడు. విల్లాది వీరుడు.. వీర‌మ‌ణి కంఠుడు అనే లైన్స్ రాసి ఫైర్ ఎమోజీతో ట్వీట్ వేయ‌డంతో ఎక్స్‌లో అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. మ‌రి ఒరిజిన‌ల్ సాంగ్‌ను య‌థాత‌థంగా వాడేస్తారా.. లేక సినిమా కోసం ట్యూన్ ఏమైనా మారుస్తారా అన్న‌ది ఆస‌క్తిక‌రం.

ఎక్కువ మార్పు లేకుండా చిన్న చిన్న చేంజెస్‌తో ఒరిజిన‌ల్ సాంగ్‌ను సినిమాలో పెడితేనే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి జి.వి.ప్ర‌కాష్ ఏం చేస్తాడో చూడాలి. మొత్తంగా ఈ సినిమా ఆల్బ‌మ్ మీద ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ర‌వితేజ స‌ర‌స‌న ప్రియ భ‌వాని శంక‌ర్ న‌టిస్తున్న ఇరుముడి ఈ ఏడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

This post was last modified on May 14, 2026 1:48 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

8 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

10 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

10 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

12 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

13 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

14 hours ago