గత ఏడాది డిసెంబర్ లో కార్తీ నటించిన వా వతియర్ / అన్నగారు వస్తారు చివరి నిమిషంలో విడుదల ఆగిపోయిన విషయం అభిమానులు అంత సులభంగా మర్చిపోలేరు. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టేసి టికెట్లు అమ్మాక రిలీజ్ లేదని చెప్పడం షాక్ కు గురి చేసింది. ముఖ్యంగా తమిళనాడు ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తర్వాత అష్టకష్టాలు పడి అన్ని క్లియర్ చేసుకుని జనవరి సంక్రాంతికి థియేటర్లకు తీసుకొచ్చారు. ఇంతా చేస్తే అదేమో దారుణంగా డిజాస్టరయ్యింది.
తమ్ముడికి అలా జరిగితే తాజాగా అన్నయ్య సూర్య కూడా అలాంటి సంకట స్థితిలో ఇరుక్కున్నాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావాలిన కరుప్పు / వీరభద్రుడు ఇంకొన్ని గంటల్లో షోలు పడతాయి అనంగా పెద్ద బాంబు వేసింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలు కావాల్సిన షోలు ఆపేశారు. పోనీ మధ్యాన్నం ఉందనుకుంటే అదీ జరగలేదు. ఇక సాయంత్రం, రాత్రి షోల మీద కూడా అనుమానాలున్నాయి. అయితే రేపు లేదంటే ఇంకో వారం ఆగాల్సిందేనని చెన్నై రిపోర్ట్.
నిర్మాత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదం వల్లే కరుప్పుకి చివరి నిమిషంలో ల్యాబ్ క్లియరెన్సులు ఆగాయని తెలిసింది. దర్శకుడు ఆర్జె బాలాజీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియో వదిలారు. ఏ క్షణమైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఎమోషనల్ చెప్పడం వైరల్ అవుతోంది. అయితే నిజంగా పరిష్కారం దిశగా వెళ్తున్నారా లేదానేది తెలియాల్సి ఉంది. సూర్య స్వయంగా రంగంలోకి దిగారని టాక్. అయినా సరే క్లిష్టంగానే ఉందట.
మొత్తానికి ఎలాంటి వివాదాల జోలికి వెళ్లని అన్నదమ్ములకు ఒకే సమస్య రావడం విషాదం. సూర్య గత కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్ లేక ఆశలన్నీ కరుప్పు మీదే పెట్టుకున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ పూర్తిగా క్లాస్ మూవీ కాబట్టి మాస్ ని ఆకట్టుకోవడానికి కరుప్పునే మంచి ఛాన్స్ అనుకున్నాడు. తీరా చూస్తే పరిణామాలేమో రివర్స్ లో ఉన్నాయి. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ కోర్ట్ రూమ్ ప్లస్ యాక్షన్ డ్రామాకు సాయి అభ్యంక్కర్ సంగీతం సమకూర్చడం మరో ప్రధాన ఆకర్షణ.
This post was last modified on May 14, 2026 3:52 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…