ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో నివురు గప్పిన నిప్పులా మొదలైన సింగల్ స్క్రీన్ల పర్సెంటెజ్ వివాదం ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య వ్యక్తిగత ఇష్యూగా మారిపోయింది. ముఖ్యంగా శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, నాగవంశీలు పరస్పరం చేసుకున్న విమర్శలు, జోకులు సోషల్ మీడియా నట్టింట్లోకి వచ్చేశాయి. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది పక్కనపెడితే ఇది కాస్తా జనాలకు టైం పాస్ కంటెంట్ అయిపోవడం ఎంత మాత్రం మంచిది కాదనేది వాస్తవం.
స్వంత కుటుంబాల్లోనే ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాంటిది వేల కోట్ల పెట్టుబడులతో లక్షల మందికి జీవనోపాధి కలిగించే టాలీవుడ్ లో లేకుండా పోవు. గతంలో ఇంత కంటే తీవ్రమైన సంక్షోభాలు ఎన్నో చూశాం. రోజుల తరబడి షూటింగులు ఆగిపోయి ప్రొడ్యూసర్లు తల్లడిల్లిపోవడం కొత్త కాదు. కరోనా టైంలో థియేటర్లు మూతబడి సిబ్బంది అల్లాడిపోయిన ఉదంతాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది వాటికన్నా పెద్దది కాదు ఘోరమైంది అంతకన్నా కాదు.
కానీ వీధికెక్కి ఒకరి పరువు మరొకరు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా ఇవాళ అన్న మాటలు శాశ్వతంగా వీడియో రూపంలో భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో వ్యాపార ప్రత్యర్థులు వీటినే అస్త్రాలుగా మార్చుకుంటారు. సింగల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల మధ్య షేర్ల వ్యత్యాసాల గురించి కూచుని మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా కెమెరాల ముందు రోజుకొకరు కాంట్రావర్సీ చేస్తే పరిష్కారం దొరకడం మాట అటుంచి ఇదో ఈగోల యుద్ధంగా మారిపోయింది.
ఎవరో ఒకరు పెద్ద మనిషి పాత్ర పోషించి దీన్ని పరిష్కరించడం అవసరం. దాసరిని గుర్తు చేసుకోవడం కాదు, ఆయన స్థానాన్ని ఎవరు తీసుకుంటారని కాదు, ఇంతదాకా వచ్చాక ఇది మరింత ముదరకుండా ఆపే చొరవ ఎవరో ఒకరు తీసుకోవాలి. తెలంగాణ ఎఫ్డిసి చైర్ మెన్ గా ఉన్న దిల్ రాజు, అగ్ర నిర్మాత సురేష్ బాబు తదితరులు తటస్థంగా ఉండటం ఆందోళన పెంచుతోంది. గుట్టుగా ఉండాల్సిన కాపురాలు బయట గొడవలకు దిగితే కొంపలు కూలుతాయి. వీలైనంత త్వరగా దీనికి చెక్ పడితే మంచిది.
This post was last modified on May 14, 2026 1:06 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…