Movie News

అల్లు, సురేష్… ముందే పసిగట్టారా?

తెలుగు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్ల మధ్య పర్సంటేజీ వార్ పీక్స్‌లో ఉంది. శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్ సింగిల్ స్క్రీన్ల కోసం గళం విప్పుతుంటే, రవిశంకర్, నాగవంశీ లాంటి యంగ్ ప్రొడ్యూసర్లు స్ట్రెయిట్ కౌంటర్లు ఇస్తున్నారు. కానీ ఈ మాటల తూటాల మధ్య అల్లు అరవింద్, సురేష్ బాబు పేర్లు ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు. ఇండస్ట్రీలో ఏ చిన్న తుఫాన్ వచ్చినా కూల్ చేసే ఈ ఇద్దరు దిగ్గజాలు ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనేదే అసలు సందేహం.

ఇది మౌనం కాదు, ముందుచూపు అనే కామెంట్స్ వస్తున్నాయి. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ల నుంచి గత కొన్నేళ్లుగా భారీ బడ్జెట్ సినిమాలు రావడం తగ్గిపోయాయి. ప్రొడక్షన్ రిస్క్. రోజుకు 3 కోట్లు ఖర్చయ్యే సెట్స్, హీరోల రెమ్యునరేషన్లు, ఓటీటీ డీల్స్ పడిపోవడం వీళ్లు రెండేళ్ల క్రితమే పసిగట్టారు. అందుకే కెమెరా ముందు కంటే, కెమెరా వెనుక బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు. కొత్త ప్రొడ్యూసర్లు థియేట్రికల్ షేర్ కోసం కొట్టుకుంటుంటే, వీళ్లు డిస్ట్రిబ్యూషన్, డిజిటల్, ఎగ్జిబిషన్ అనే మూడు పిల్లర్లను గట్టిగా పట్టుకున్నారు.

అల్లు అరవింద్ ‘ఆహా’తో డిజిటల్ ఎకోసిస్టమ్ కట్టుకుంటే, సురేష్ బాబు ఏషియన్ మల్టీప్లెక్స్‌లతో థియేటర్ చైన్‌ను స్ట్రాంగ్ చేసుకున్నారు. సినిమా తీసి లాభం రాకపోతే నష్టం. కానీ సినిమా ఆడే థియేటర్, సినిమా స్ట్రీమ్ అయ్యే ప్లాట్‌ఫామ్ వీళ్ల చేతిలో ఉంటే ప్రతి సినిమా మీద కమీషన్ వీళ్లదే. అందుకే ఇప్పుడు పర్సంటేజీ గొడవ అవసరం లేదు. యుద్ధం చేసేది సైనికులు, రాజు కాదు. ఇండస్ట్రీ సింహాసనం మీద కూర్చున్న వాళ్లకు రచ్చలోకి దిగే అవసరం లేదు.

అలాగే బహిరంగంగా మాట్లాడితే ఒక వర్గానికి దగ్గరవుతారు, మరో వర్గానికి దూరమవుతారు. ఇప్పుడు ఇద్దరికీ కావాల్సింది బ్రాండ్ వాల్యూ. ఇన్నేళ్ల లెగసీని ఒక్క స్టేట్‌మెంట్‌తో పోగొట్టుకోరు. తెర ముందు రచ్చ జరుగుతుంటే, తెర వెనుక సెటిల్మెంట్‌ కోసం మళ్ళీ ఇలాంటి దిగ్గజాలే కావాలి. మరి అందరిని కూల్ చేసేందుకు బయటకు వస్తారా లేదంటే మనకెందుకులే అని సైలెంట్ అయిపోతారా అనేది చూడాలి.

This post was last modified on May 14, 2026 11:42 am

Share

Recent Posts

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

38 minutes ago

రావిపూడి మార్కు మళ్ళీ మొదలయ్యింది

ఎవరు ఏమన్నా, ఎన్ని కామెంట్లు చేసినా దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి నేర్చుకోవాల్సిన విషయాలైతే చాలా ఉన్నాయి. మొదటిది కమిట్…

2 hours ago

ఇరుముడి ఇన్నింగ్స్ ఇంకా ఉన్నాయా

మూడు వారాలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ రేంజ్ లో వీరబాదుడు బాదిన ఇరుముడి కలెక్షన్లు క్లైమాక్స్ కు వచ్చాయేమోనని అనుకుంటే…

2 hours ago

ప్రభాస్ సినిమాల లెక్కలన్నీ తారుమారు

కొన్ని రోజులుగా ఉన్న అనుమానాలు ఈ రోజు మరింత బలపడిపోయాయి. ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజి’ మరోసారి వాయిదా పడబోతోందని…

4 hours ago

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వెళ్లిందా?

అమరావతి సౌండ్ లడఖ్ వరకు వినిపిస్తోందా..? ఇక్కడి విపక్షానికి మాత్రం అది వినిపించడం లేదా..? అమరావతి రాజధాని అంశానికి సంబంధించిన…

4 hours ago

జనసేనకు 50 నుంచి 60.. బొలిశెట్టి వారి లెక్క‌లు!

జ‌న‌సేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంత చెబుతున్నా.. కొంద‌రు నాయ‌కులు త‌మ పంథాను మార్చుకోవ‌డం లేదు.…

6 hours ago