Movie News

అల్లు అర్జున్ డాన్స్ స్టెప్ కు కూడా కాపీరైట్?

‘పుష్ప’ తగ్గేదేలే మేనరిజం ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. బన్నీ సిగ్నేచర్ స్టైల్‌ని వాడుకోని వాళ్లే లేరు. ఇన్‌స్టా రీల్స్‌లో, ఏఐ వీడియోల్లో, లోకల్ బ్రాండ్ ప్రమోషన్లలో ఎక్కడ చూసినా అదే పోజు. ఒక విధంగా అది క్రేజ్‌కి ప్రూఫ్ అయినా, బ్రాండ్ వాల్యూకి డ్యామేజ్ కూడా. ఇదే పాయింట్‌ని ఇప్పుడు ‘రాక’ టీమ్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అట్లీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ కోసం బన్నీ మూమెంట్స్‌కి, డ్యాన్స్ స్టెప్పులకి లీగల్ ప్రొటెక్షన్ తెస్తున్నారని టాక్.

ఇది కేవలం కాపీరైట్ ఇష్యూ కాదు, కమర్షియల్ వార్. ‘శ్రీవల్లి’ స్టెప్, తగ్గేదేలే హ్యాండ్ సింబల్ వైరల్ అయ్యాక లక్షల రీల్స్ పుట్టుకొచ్చాయి. కానీ అందులో 90% అనఫీషియల్ కమర్షియల్ యూసేజ్. చిన్న కిరాణా షాప్ యాడ్ నుంచి పెద్ద బ్రాండ్ మీమ్ పేజ్ వరకు అందరూ బన్నీ ఇమేజ్‌ని ఫ్రీగా వాడేశారు.

దీనివల్ల హీరో పర్సనల్ బ్రాండ్ డైల్యూట్ అయిపోతోంది. ‘రాక’ విషయంలో ఆ తప్పు రిపీట్ కాకూడదనేది మేకర్స్ క్లారిటీతో ఉన్నారట. అందుకే సినిమా రిలీజ్‌కి ముందే క్యారెక్టర్ మేనరిజమ్స్, స్టైలింగ్, ఐకానిక్ మూవ్స్‌ని లీగల్‌గా రిజిస్టర్ చేస్తున్నారని తెలుస్తోంది.

ఇందుకోసం అల్లు అర్జున్ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాడు. తన ఫోటో, వాయిస్, పేరు, స్టైల్‌ని అనుమతి లేకుండా వాడకూడదని కోర్టును కోరాడు. బాలీవుడ్‌లో అమితాబ్, రజనీకాంత్ లాంటి స్టార్స్ ఇంతకుముందే ఇలాంటి రక్షణ తెచ్చుకున్నారు.

కానీ టాలీవుడ్‌లో ఒక హీరో తన డ్యాన్స్ స్టెప్‌కి కూడా లీగల్ కవర్ తీసుకోవడం ఇదే మొదటిసారి కానుంది. ‘రాక’ కోసం అట్లీ కొత్త సిగ్నేచర్ మూవ్స్ క్రియేట్ చేస్తున్నాడు. అవి బయటికి రాకముందే వాటి హక్కులు మనవే అని ఫిక్స్ చేసుకుంటున్నారు. ఏఐతో ఫేక్ వీడియోలు ఈజీగా చేసే రోజుల్లో ఇలాంటి జాగ్రత్త చాలా అవసరం.

ఈ స్ట్రాటజీ వెనుక మరో బిజినెస్ యాంగిల్ కూడా ఉందని చెప్పవచ్చు. ‘రాక’ కేవలం సినిమా కాదు, ఒక బ్రాండ్. గేమింగ్, మెర్చండైజ్, NFT, బ్రాండ్ కొలాబరేషన్స్ అన్నింటిలో బన్నీ స్టైల్‌ని మానిటైజ్ చేయాలని ప్లాన్. అలాంటప్పుడు ఎవరైనా సరే ఫ్రీగా ఆ స్టెప్‌ని వాడేస్తే కోట్ల నష్టం.

అందుకే ముందుగానే లైన్ క్లియర్ చేస్తున్నారు. ఫ్యాన్స్ రీల్స్ చేయొచ్చు, కానీ కమర్షియల్ యాడ్స్‌లో, ఏఐ కంటెంట్‌లో అనుమతి లేకుండా వాడితే లీగల్ నోటీసులు వెళ్తాయి. ఇది కాస్త స్ట్రిక్ట్ అనిపించినా, హాలీవుడ్‌లో మార్వెల్ క్యారెక్టర్స్‌కి ఉన్నంత ప్రొటెక్షన్ మన హీరోలకు కూడా రావాల్సిన టైమ్ వచ్చేసింది.

This post was last modified on May 14, 2026 11:26 am

Share

Recent Posts

రవితేజ అసలు భూమి మీద ఆగట్లేదుగా…

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎంట్రీ చూసిన వాళ్లకు ఒక విషయం వెంటనే అర్థమైపోతుంది. నార్మల్ గా ఎప్పుడూ నవ్వుతూ,…

1 hour ago

ఆంధ్రా పాపకార్న్… నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్!

పాప్ కార్న్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కాల‌క్షేపం కోసం తినే ఈ పాప్ కార్న్.. మొక్క‌జొన్న లోని…

1 hour ago

ఆదర్శ కుటుంబం ఇంక ఆలస్యం చేయొద్దు

ఆగస్ట్ నెల దాదాపు అయిపో వచ్చింది. ఆదర్శ కుటుంబం విడుదల అక్కడి నుంచి కేవలం ఒక నెల రోజులు మాత్రమే…

1 hour ago

`సెల్ఫీ ప్లీజ్`… అంటూ ముద్దు పెట్టేసింది!

కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీకి ఊహించ‌ని ఘ‌ట‌న ఎదురైంది. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న యువ‌త‌ను చేర‌దీసే ప‌నిలో ప‌డిన విష‌యం…

2 hours ago

లిక్క‌ర్ కేసు… కారుమూరితోనే క‌థ అయిపోలేదు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన 3500 కోట్ల రూపాయ‌ల లిక్క‌ర్ కుంభ‌కోణం కేసు.. అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీల‌క…

2 hours ago

మహాకాళి శ్రియ… థియేటర్లలో పూనకాలే!

శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…

2 hours ago