Political News

మహసేన రాజేష్ vs రఘురామ

ఉండి ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు… టీడీపీ నేతగానే కొనసాగుతున్నా.. ఆయనపై అదే పార్టీకి చెందిన కొందరు నేతలు విమర్శలు సందిస్తున్నారు. ప్రత్యేకించి దళిత సామాజిక వర్గానికి చెందిన నేతలు రఘురామపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా… వారికి రఘురామ కూడా తనదైన శైలిలో సమాధానం ఇస్తూ సాగుతున్నారు.

ఈ క్రమంలోనే టీడీపీకే చెందిన మహాసేన రాజేశ్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ రఘురామ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆకివీడు రామాలయానికి రాజేశ్ చేసిన మేలేమిటో కూడా తనకు అర్థం కావడం లేదని ఆయన సెటైర్లు సంధించారు.

అయినా రాజకీయాలన్నాక… ఆయా అంశాలపై ఒక్కో నేత ఒక్కో రకంగా స్పందిస్తారని రఘురామ అన్నారు. రాజకీయ వైరాన్ని వ్యక్తిగత వైరంగా ఎలా చూస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను మాజీ ఎంపి విజయ సాయి రెడ్డితో మాట్లాడటాన్ని రాజేశ్ ఎలా తప్పుబడతారని కూడా ఆయన ప్రశ్నించారు. వైసీపీలో ఉండగా… సాయిరెడ్డితో తాను స్నేహంగానే ఉన్నానని చెప్పారు. తానెవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడొద్దో రాజేశ్ ఎలా నిర్ణయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు పెదపేటలో నెలకొన్న రామాలయ వివాదం నేపథ్యంలోనే ఈ తరహా విచిత్ర పరిస్థిత నెలకొందని చెప్పాలి. పెదపేటలో రామాలయమే లేదని, అక్కడ గొంతేనమ్మ గుడి మాత్రమే ఉందన్నది పెదపేట దళితుల వాదన.

అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం అక్కడి భూమి రామాలయానికి చెందినదేనని రఘురామ చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పక్కా ఆధారాలు చూపుతూ ఏకంగా హైకోర్టు ఆదేశాలతోనే రామాలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

ఈ వివాదంపై దళిత సంఘాలకు చెందిన నేతలు తనను తప్పుబడుతున్న తీరును రఘురామ ఖండించారు. ఆకివీడు రామాలయం నిర్మాణానికి తన సహకారం కూడా ఉందని రాజేశ్ చేసిన వ్యాఖ్యలపై రఘురామ విచిత్రంగా స్పందించారు.

రాజేశ్ వ్యాఖ్యలపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రఘురామ… రాజేశ్ ఏ రీతిన రామాలయం నిర్మాణానికి సహకరించారో తనకు అర్థం కావడం లేదని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఒకవేళ రామాలయ నిర్మాణానికి తాను తోడ్పాటు అందించానని రాజేశ్ అనుకుంటే.. ఆయనకు ధన్యవాదాలు అంటూ రఘురామ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.

This post was last modified on May 14, 2026 11:05 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

7 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago