తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత హైప్ మధ్య విడుదలైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒకటి. 2001 సంక్రాంతికి మృగరాజు, నరసింహనాయుడు లాంటి భారీ చిత్రాలతో ఈ మూవీ పోటీ పడింది. మిగతా రెండు చిత్రాల మీదా భారీ అంచనాలే ఉన్నాయి కానీ.. దేవిపుత్రుడుకు ఉన్న హైప్ వేరు. అప్పటికి టాలీవుడ్లో అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన చిత్రమిది.
దాని కథాంశం, ట్రైలర్, పాటలు అన్నీ కూడా వేరే లెవెల్లో కనిపించాయి. దీంతో ఎంతో ఊహించుకుని థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ చిత్రం మిశ్రమానుభూతిని కలిగించింది. కథ ఆసక్తికరంగానే ఉంటుంది. విజువల్స్ గొప్పగా ఉంటాయి. వెంకీ నటన, పాటలు కూడా సూపరే. కానీ సినిమాలో ఏదో మిస్సయిన ఫీలింగ్ వల్ల చివరికి ప్రేక్షకులు పెదవి విరిచారు.
సినిమా ఫ్లాప్ అయింది. నిర్మాత ఎంఎస్ రాజుకు, బయ్యర్లకు భారీ నష్టాలు తప్పలేదు. ఐతే హీరో వెంకీ మాట వినకపోవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎంఎస్ రాజు వెల్లడించారు.
దేవి పుత్రుడు స్క్రిప్టును వెంకీ విన్నాక చివరి 45 నిమిషాల్లో కొంచెం తేడాగా ఉందని.. దాన్ని సరి చేశాక షూటింగ్‌కు వెళ్దామని సూచించినట్లు రాజు తెలిపారు. ఐతే తాము మాత్రం ఆయన మాట వినకుండా హడావుడిగా షూటింగ్ మొదలుపెట్టేశామని.. కానీ సినిమా చివరి దశకు వచ్చాక ఈ కథను ఎలా ముగించాలో తెలియక తాను, దర్శకుడు కోడి రామకృష్ణ తలలు పట్టుకున్నామని రాజు చెప్పారు.
ఆ కథకు ఫిట్ అయ్యే క్లైమాక్స్ కోసం తాను, కోడి రామకృష్ణ రకరకాల వెర్షన్లు ట్రై చేశామని.. చివరికి ఏదీ సరిగా కుదరలేదని.. అందువల్లే సినిమా పోయిందని ఆయనన్నారు. చివరికి ఫలితం చూశాక వెంకీ మాట వినకపోవడం పెద్ద తప్పు అని తమకు అర్థమైందని రాజు చెప్పారు.
దేవి పుత్రుడు మీద అప్పట్లోనే రూ.15 కోట్ల బడ్జెట్ పెట్టడం విశేషం. ఈ సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చినప్పటికీ ఎంఎస్ రాజు జావగారిపోకుండా తర్వాత మనసంతా నువ్వేతో సూపర్ హిట్ కొట్టారు. ఆ తర్వాత ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో ఆయన దూసుకెళ్తారు. రాజు డైరెక్ట్ చేసిన అగథ చిత్రం త్వరో విడుదలకు సిద్ధమవుతోంది.
This post was last modified on May 11, 2026 11:24 pm
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…
ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రకటించే నంది అవార్డులకు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డులతో సమానంగా చూసేవారు.…
టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…
జాతీయ గేయం వందేమాతరం వ్యవహారంపై జరుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…