Movie News

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే రావాల్సిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాల్లో ప్రతికూల పరిస్థితుల కారణంగా మే 21కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ తేదీకే పక్కాగా సినిమా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈ చిత్రం మేకింగ్ దశలో ఉండగా.. తెలుగు రీమేక్ మీద రకరకాల వార్తలు వచ్చాయి.

దృశ్యం, దృశ్యం-2 చిత్రాలను రీమేక్ చేసిన విక్టరీ వెంకటేష్.. దృశ్యం-3లో కూడా నటిస్తాడని, నటించడని.. ఇలా సందిగ్ధత నడిచింది. చివరగా వెంకీ ‘దృశ్యం-3’ని పక్కన పెట్టినట్లే వార్తలు వచ్చాయి. ఐతే ఆ విషయం అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. ‘దృశ్యం-2’ వచ్చినపుడు రీమేక్ గురించి చర్చ లేదు. కానీ తర్వాత వెంకీ దాన్ని టేకప్ చేశాడు. ఇప్పుడు కూడా అలాగే చేస్తాడేమో అన్న సందేహాలు కూడా కలిగాయి. కానీ ఇప్పుడు ఆ సందేహాలకు తెరపడింది. రాంబాబు ఇక రాడని తేలిపోయింది.

‘దృశ్యం-3’ తెలుగు రీమేక్ క్యాన్సిల్ అయినట్లు కన్ఫమ్ అయింది. ఎందుకంటే ఈ నెల 21న మలయాళ వెర్షన్‌తో పాటే తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఈ మేరకు ట్రైలర్ కూడా లాంచ్ కావడంతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ రోజుల్లో రీమేక్‌లు చేయడమే పెద్ద రిస్క్ అయిపోయింది. పైగా ‘దృశ్యం’ ఫ్రాంఛైజీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సౌత్ ఇండియా అంతటా జనాలు మలయాళ వెర్షన్‌ చూడడానికి సిద్ధంగా ఉన్నారు. థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఎలాగూ నెల రోజులకే ఓటీటీలోకి ఆ సినిమా వచ్చేస్తుంది.

అలాంటపుడు మళ్లీ తెలుగులో తీయడం వ్యర్థం. అందుకే వెంకీ అన్నీ ఆలోచించి రీమేక్ నుంచి తప్పుకున్నట్లు ఉన్నాడు. కానీ హిందీలో మాత్రం ఈ చిత్రం రీమేక్ అవుతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఒరిజినల్ నిర్మాత పెట్టిన కండిషన్ మేరకు ఆ చిత్రాన్ని కొంచెం లేటుగా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబరులో అది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక మలయాళ వెర్షన్‌ను తమిళంలో సైతం అనువాదం చేసి రిలీజ్ చేస్తున్నారు.

This post was last modified on May 12, 2026 9:15 am

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

7 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

1 hour ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

9 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

10 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago