Movie News

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సోషల్ మీడియా కోసం సినిమా తీయలేదని, చీకటి గదిలో కూచుని రివ్యూల పేరుతో పోస్ట్ మార్టం చేసేవాళ్లని పట్టించుకోనని, అదే సమయంలో బుర్రని ఇంట్లో వదిలేసి రమ్మని ప్రేక్షకులను కోరనని, లాజిక్స్ ఉన్న ప్రాపర్ ఎంటర్ టైనర్ తీశానని హామీ ఇచ్చారు. ఏపీ తెలంగాణ తమిళనాడు ఆడియన్స్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.

నిజానికి రిలీజ్ కు ముందు ఈ టాపిక్ మీద దర్శకులు మాట్లాడ్డం అరుదు. బాలాజీ రియాక్ట్ అవ్వడానికి కారణం లేకపోలేదు. తమిళ వెర్షన్ ట్రైలర్ వచ్చాక ఎక్స్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాల్లో కొంత మిశ్రమ స్పందన కనిపించింది. ముఖ్యంగా మెయిన్ విలన్ గా ఆర్జెజె బాలాజీ సూట్ కాలేదని ఎక్కువ శాతం కామెంట్ చేశారు. సూర్య లాంటి మాస్ కటవుట్ ముందు బాలాజీ అనలేదని, కామెడీ పాత్రల్లో చూసి అలవాటైన తనను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అన్నారు.

అయితే ప్రాక్టికల్ గా చూసుకుంటే బాలాజీ కొన్ని లాజిక్స్ మిస్ అవుతున్నారు. సోషల్ మీడియా అనేది వేరే ప్రపంచం కాదు. అక్కడ ఉండేది కూడా సగటు అభిమానులు, సినిమా ప్రియులే. కాకపోతే అటాకింగ్ స్టయిల్ కాస్త ఎక్కువగా ఉంది. సినిమా పాజిటివ్ గా ఉంటే మోసేది వీళ్ళే, తేడా కొడితే ట్రోలింగ్ చేసేది వీళ్ళే. ఫేక్ ఐడిలతో ఆపరేట్ చేసినా వాళ్ళూ మనుషులే. సో ఆ బ్యాచ్ కోసం తీసినా తీయకపోయినా వాళ్ళు చూడటం మానరు, అభిప్రాయాలు చెప్పకుండా ఉండరు.

ఫైనల్ గా మాట్లాడాల్సింది కంటెంట్ తప్ప మరొకటి కాదు. వీరభద్రుడు మీద బజ్ తక్కువగా ఉన్న మాట వాస్తవమే. అటు తమిళంలో హైప్ మెల్లగా పెరుగుతోంది. కొన్నేళ్లుగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకి ఇది విజయం సాధించడం చాలా కీలకం. నయనతారతో అమ్మోరు తల్లి రూపంలో ఓటిటి డెబ్యూ హిట్టు కొట్టిన ఆర్జె బాలాజీకి ఇది హిట్ అయితే సూర్యకి బ్రేక్ ఇచ్చిన ఆనందంతో పాటు స్టార్ హీరోల నుంచి పిలుపులొస్తాయి. విలన్ గా కూడా చేశాడు కాబట్టి అది క్లిక్ అయితే నటుడిగా మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయొచ్చు.

This post was last modified on May 11, 2026 11:14 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

39 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

5 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago