Movie News

నంబర్ వన్ కమెడియన్లు ఒక్కటయ్యారు

తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల కిషోర్ సహా తోటి కమెడియన్లు అందరినీ వెనక్కి నెట్టి టాప్‌లోకి వెళ్లిపోయాడు సత్య. ఈ తరం ప్రేక్షకులకు చూడగానే నవ్వు తెప్పించే కమెడియన్ అతనే. మత్తు వదలరా-2 చిత్రం తన కెరీర్లో గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఆ సినిమా అంత బాగా ఆడిందంటే అది తన వల్లే.

ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఏకంగా సత్యను హీరోగా పెట్టి రితేష్ రాణా ‘జెట్లీ’ మూవీ తీశాడు. ఇందులో సత్య తనదైన శైలిలో ఎంటర్టైన్ చేశాడు కానీ.. ఓవరాల్‌గా సినిమా మెప్పించలేకపోయింది. ఈ చిత్రం ఫ్లాప్ అయింది కాబట్టి ఎందుకొచ్చిన హీరో వేషాలని అతనేమీ వెనుకంజ వేయలేదు.

సత్య హీరోగా ఇంకో సినిమా మొదలైంది. ఐతే ఇందులో అతనొక్కడే కథానాయకుడు కాదు.. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు కూడా ఇందులో లీడ్ రోల్ చేస్తున్నాడు.
తెలుగులో సత్య ఇప్పుడు రైజ్ అయ్యాడు కానీ.. చాలా ఏళ్ల నుంచి అక్కడ నంబర్ వన్ కమెడియన్‌గా కొనసాగుతున్నాడు.

అతను ఇప్పటికే ‘మండేలా’ సహా కొన్ని చిత్రాలు చేశాడు. ‘మండేలా’ తమిళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత కూడా అతను కామెడీ రోల్స్ చేస్తూనే.. అప్పుడప్పుడూ లీడ్ రోల్స్ చేస్తున్నాడు. ఇప్పుడు సత్య, యోగిబాబును పెట్టి ‘రంగబలి’ దర్శకుడు పవన్ బాసంశెట్టి తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రానికి పవన్ నిర్మాత కూడా కావడం విశేషం. నాగార్జున రెడ్డి అనే మరో యువ నిర్మాతతో కలిసి పవన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ‘రంగబలి’ ఫ్లాప్ అయినప్పటికీ.. అందులో సత్య కామెడీ అదిరిపోతుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకుని బాధపడితే అందులో సంతోషాన్ని వెతుక్కునే పాత్రలో సత్య కడుపుబ్బ నవ్వించాడు.

సత్య నుంచి మంచి కామెడీ రాబట్టుకోగల సత్తా ఉన్న పవన్.. అతడితో పాటు యోగిబాబును కూడా హీరోగా పెట్టి సినిమా తీయాలనుకోవడం విశేషమే. మరి ఈ చిత్రానికి యోగిబాబు లక్ కూడా కలిసొచ్చి హీరోగా సత్య ఖాతాలో మంచి హిట్ పడుతుందేమో చూద్దాం.

This post was last modified on May 11, 2026 8:07 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

2 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

4 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago