కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ.. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే.. ఈ నిరసనలకు పిలుపు నిచ్చారు. గతంలో నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి ఆయన నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే.. అప్పట్లో అది హింసాత్మకంగా మారింది. పోలీసులు-యువతకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాట, లాఠీ చార్జి కూడా జరిగాయి.
ఇక, తాజాగా ఇచ్చిన నిరసనకు సంబంధించి పోలీసులు మరోసారి అనుమతులు నిరాకరించారు. అంతేకాదు.. ఢిల్లీ లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి నివాసాలు, ప్రధాని కార్యాలయం, కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంతోపాటు.. అన్నింటినీ అష్టదిగ్బంధనం చేశారు. అన్ని దారులను మూసి వేశారు. గత నీట్ నిరసనల నేపథ్యంలో చెలరేగిన హింసను దృష్టిలో పెట్టుకుని.. పెద్ద ఎత్తున రెండు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ క్యానన్లు రెడీ చేసుకున్నారు.
ఎక్కడా నిరసనలకు అనుమతి లేదని పోలీసులు ప్రతి రెండు గంటలకు ఒకసారి ప్రకటన జారీ చేయడం గమనా ర్హం. అంతేకాదు.. రాజధాని ప్రాంతంలో యాక్ట్ 30 సహా 144 సెక్షన్‌ను కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గాంధీ జయంతి కార్యక్రమం నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించినట్టు పేర్కొన్నారు. అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించడం గమనార్హం.
అయినా ఆగదు: దీప్కే
పోలీసుల ఆంక్షలపై అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ జయంతి నాడు ఆయన చూపించిన అహింసా మార్గంలోనే తాము నిరసన చేపట్టాలని భావించామని అన్నారు. అయితే.. పోలీసులు అహింసాయుత నిరసనపైనే ఉక్కుపాదం మోపారని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమ ఉద్యమం, నిరసన ఆగబోదని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని దీప్కే పట్టుబట్టారు. మరోవైపు దీప్కే ఉద్యమానికి సమాంతరంగా కాంగ్రెస్ పార్టీ కూడా సిద్ధమైంది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. దీనిని జాతీయ ఉద్యమంగా మార్చినట్టు చెప్పారు. జ్ఞానేష్ రాజీనామా చేయాల్సిందేనన్నారు.
This post was last modified on October 2, 2026 6:49 pm
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…