గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన రావడం ప్రేక్షకులకు గుర్తే. త్రివిక్రమ్ బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ పంపిణి బాధ్యతలు తీసుకున్నట్టు అనౌన్స్ మెంట్ ఇచ్చారు. అయితే ఇంకో రెండు మూడు రోజుల్లో రిలీజ్ ఉందనగా హఠాత్తుగా ఆపేశారు. కారణాల గురించి ఫిలిం నగర్ వర్గాల్లో రకరకాల ప్రచారం జరిగింది. కారణాలు ఏమైనా త్రివిక్రమ్ ఆ బాధ్యతను నుంచి తప్పుకున్నాక హోంబాలే ఫిలిమ్స్ హక్కులు తీసుకుంది.
ఇప్పుడీ డివోషనల్ బ్లాక్ బస్టర్ ఏపీ తెలంగాణాలో అక్టోబర్ 9 విడుదల కానుంది. ఒక బాలీవుడ్ మూవీ అర్ధ శతదినోత్సవం టైంలో దాని డబ్బింగ్ వెర్షన్ థియేటర్లకు రావడం చాలా అరుదైన పరిణామం. అది హనుమాన్ అంశ్ చేసి చూపిస్తోంది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తున్న రోజే ఈ సినిమాని క్లాష్ కి సిద్ధం చేయడం. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దనుకున్న మూవీనే తిరిగి త్రివిక్రమ్ కు పోటీగా వచ్చేందుకు సిద్ధమవుతోందన్న మాట.
పరస్పర ప్రభావం ఒకదాని మీద మరొకటి ఎలా ఉంటుందనేది చెప్పలేం కానీ ఆదర్శ కుటుంబం వెంకటేష్ సినిమా కావడం, త్రివిక్రమ్ దర్శకత్వం, తమన్ సంగీతం లాంటి అంశాల వల్ల ఖచ్చితంగా ఆడియన్స్ లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాని హనుమాన్ అంశ్ ఎఫెక్ట్ ని తక్కువ చేసి చూడలేం. ఇంకా చూడని ప్రేక్షకులు భారీగా ఉంటారు. వాళ్ళు కనక థియేటర్లో చూడాలని డిసైడ్ అయితే రెవిన్యూ పరంగా కొంత పంచుకోవడం ఉంటుంది. కానీ రెండూ సమాన స్థాయిలో అయితే ఉండకపోవచ్చు.
ఇదొక్కటే కాదు వెంకటేష్ వీరాభిమాని శ్రీవిష్ణు కామ్రేడ్ కళ్యాణ్ కూడా అక్టోబర్ 9 వస్తున్న సంగతి తెలిసిందే. దసరాకు జైలర్ 2, రణబాలి రూపంలో పోటీ ఎక్కువగా ఉండటం వల్ల ముందుగానే రావాలని డిసైడ్ కావడంతో ఆదర్శ కుటుంబంతో క్లాష్ తప్పడం లేదు. హిందీలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెడుతున్న హనుమాన్ అంశ్ తెలుగులో ఏ మేరకు మేజిక్ చేస్తుందో చూడాలి. బాగా లేట్ చేయడం వల్ల జనంలో ఆసక్తి ఏ మేరకు ఉందనేది కలెక్షన్లను బట్టి అర్థం చేసుకోవచ్చు.
This post was last modified on October 2, 2026 1:09 pm
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…