నిన్నటి తరంలో ఒక ఊపు ఊపిన సీనియర్ హీరోలు ఇప్పుడు ప్రత్యేక పాత్రల ద్వారా తమ ఉనికిని చాటుకోవడంతో పాటు కొత్త దర్శకులకు తాము ఎలా ఉపయోగపడే అవకాశం ఉందో ఇంటర్వ్యూల రూపంలోనూ హింట్ ఇస్తున్నారు. గత నెల విడుదలైన బైకర్ లో యాంగ్రీ మ్యాన్ ‘రాజశేఖర్’కు తండ్రి, తాతగా మంచి క్యారెక్టర్ దక్కినప్పటికీ థియేటర్ ఆడియన్స్ కి అది పూర్తి స్థాయిలో చేరలేదు. బాక్సాఫీస్ ఫలితంతో పాటు కంటెంట్ లో ఉన్న నెమ్మదితనం వల్ల వచ్చిన సమస్య అది.
అయినా సరే ఆయన పట్టువదలకుండా పలు ఇంటర్వ్యూల ద్వారా తాను అందుబాటులో ఉన్న విషయాన్ని కొత్త డైరెక్టర్లకు చేరవేస్తున్నారు. ఇటీవలే వచ్చిన గాయపడ్డ సింహంలో ‘జెడి చక్రవర్తి’ ఏకంగా సత్య కవల సోదరుడిగా వెరైటీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తీరా చూస్తే బొమ్మ సూపర్ ఫ్లాపయ్యింది. ఎప్పుడూ లేనిది జెడి చక్రవర్తి ఈ మూవీ కోసం విపరీతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు అన్ని ఈవెంట్లలో పాల్గొన్నారు. అయినా ప్రయోజనం శూన్యం.
ఇది వీళ్ళిద్దరికే పరిమితం కాలేదు. గతంలో ‘వేణు తొట్టెంపూడి’ జూనియర్ ఎన్టీఆర్ దమ్ముతో రీ ఎంట్రీ ఇచ్చాడు. పనవ్వలేదు. గ్యాప్ తీసుకుని రవితేజ రామారావు ఆన్ డ్యూటీతో మళ్ళీ రంగప్రవేశం చేశాడు. ఇది ఇంకా పెద్ద డిజాస్టర్. దీంతో తన వ్యాపారాల్లోకి వెళ్ళిపోయాడు. 90స్ జనాలకు బాగా పరిచయమునన్న ‘నందమూరి కళ్యాణ చక్రవర్తి’ ఆ మధ్య రోషన్ మేక ఛాంపియన్ తో వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. కానీ చేదు ఫలితం దక్కింది. దీంతో ఛలో చెన్నై అనేశారు.
చెప్పుకుంటూ పోతే ఇంకా ఉదాహరణలు కనిపిస్తూనే ఉంటాయి కానీ వెటరన్ యాక్టర్స్ ని ఎలా వాడుకోవాలో తెలియకపోవడం వల్ల వచ్చే చిక్కులు ఇవన్నీ. త్వరలో ‘వడ్డే నవీన్’ కూడా తిరిగి స్క్రీన్ మీదకు వస్తున్నాడు. అది కూడా సోలో హీరోగానే. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకప్పటి యూత్ సెన్సేషన్ ‘తరుణ్’ సైతం ఒక ప్యాన్ ఇండియా మూవీలో ముఖ్యమైన క్యారెక్టర్ దక్కించుకొన్నాడట. చూడాలి ఇంకా ఎవరెవరు ఏఏ సినిమాలతో వచ్చి ఆడియన్స్ ని పలకరించబోతున్నారో.
This post was last modified on May 8, 2026 7:14 am
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…