దక్షిణాది సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నిర్మాతల్లో ఒకరైన ఆర్.బి.చౌదరి.. రెండు రోజుల కిందట ఒక కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఆయన సేవలను అటు తమిళ, ఇటు తెలుగు సినీ పరిశ్రమల్లో అందరూ స్మరించుకుంటున్నారు. ఎన్నో అద్భుతమైన కుటుంబ కథా చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసిన ఘనత ఆయన సొంతం. రెండు ఫిలిం ఇండస్ట్రీల్లోనూ అగ్ర కథానాయకులతో ఆయన సినిమాలు చేశారు.
ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ సైతం చౌదరి నిర్మించిన సినిమాలతోనే పెద్ద స్టార్ అయ్యాడు. నిన్న చౌదరి భౌతిక కాయాన్ని సందర్శించిన విజయ్ కన్నీళ్లు కూడా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సూపర్ స్టార్ రజినీకాంత్ చౌదరికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చౌదరి తన వందో సినిమాను తనతోనే ప్రొడ్యూస్ చేయాలనుకున్న విషయాన్ని వెల్లడించారు.
తాను ఆర్.బి.చౌదరితో ఒక్క సినిమా కూడా చేయలేదని.. కానీ ఆయన మీద తనకు ఎంతో గౌరవ భావం ఉందని రజినీకాంత్ వెల్లడించారు. నాలుగు నెలల ముందు చౌదరికి, తనకు మధ్య జరిగిన సంభాషణ గురించి ఆయన బయటపెట్టారు. తాను నిర్మాతగా 99 సినిమాలు నిర్మించానని.. వందో సినిమా చేసి రిటైరైపోవాలనుకుంటున్నానని.. ఆ సినిమాను మీరే చేయాలి అని చౌదరి చెప్పారని.. తాను కూడా కచ్చితంగా చేస్తానని మాట ఇచ్చానని రజినీ వెల్లడించారు.
తన కోసం కథ కూడా రెడీ చేయిస్తున్నట్లు చౌదరి చెప్పారన్నారు రజినీ. ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆయన లైఫ్ ఇచ్చారని, ఇలాంటి నిర్మాత ఇంకొకరు ఉండరని రజినీ వ్యాఖ్యానించారు. తన సినిమాలకు సంబంధించి ఎవరితో అయినా ఇబ్బంది వస్తే నేరుగా వారి ఇంటికి వెళ్లిపోయేవారని.. సమస్య ఏంటి అని అడిగి తెలుసుకుని, దాన్ని పరిష్కరించి కాఫీ తాగి వచ్చేసేవారని.. ఎవరినీ ఏ రకంగానూ ఆయన ఇబ్బంది పెట్టరని ఆర్.బి.చౌదరి వ్యాఖ్యానించారు. చౌదరి లేని లోటు ఇండస్ట్రీలో ఎప్పటికీ ఉంటుందని రజినీ అన్నారు.
This post was last modified on May 7, 2026 2:39 pm
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…
వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…