తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కావడం లాంఛనమే అంతా భావించిన తరుణంలో ఆ పార్టీ అధినేత విజయ్ కు అనుకోని చిక్కులు ఎదురు వచ్చాయి. కాంగ్రెస్ కు చెందిన 5గురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతిచ్చినా….సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి చిన్న పార్టీలు టీవీకేకు ఇంకా మద్దతివ్వలేదు. ఈ నేపథ్యంలోనే విజయ్ సీఎం సీటుకు లైన్ క్లియర్ అయ్యేలా మాజీ సీఎం స్టాలిన్ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది.
డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం నేతలతో డీఎంకే అధినేత స్టాలిన్ భేటీ అయ్యారు. విజయ్ కు మద్దతిచ్చే అంశంపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని స్టాలిన్ అన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వీసీకే, సీపీఐ, సీపీఎంలు భేటీ కాబోతున్నాయి. ఆ తర్వాత టీవీకేకు ఆ పార్టీలు మద్ధతిస్తాయా లేదా అన్న విషయంపై క్లారిటీ రానుంది.
మరోవైపు, డీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే రెడీ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ సీఎం పళని స్వామి ఖండించారు. ఇక, అన్నాడీఎంకే నుండి విజయ్ తో 25మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా, శుక్రవారం మధ్యాహ్నానికి విజయ్ కు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. సీఎం విజయ్ రియల్ లైఫ్ సినిమా సస్పెన్స్ కు రేపు తెరపడే అవకాశముంది.
This post was last modified on May 7, 2026 5:03 pm
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…